India Covid-19 : భారత్‌లో తగ్గుతున్న కరోనా కేసులు, మరణాలు

భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు ఇంకా నమోదవుతున్నాయి. అయితే..గతంలో నమోదైన కేసుల కంటే..ఇప్పుడు తక్కువగా నమోదు కావడం ఊరటనిస్తోంది. కొత్తగా 1,34,154 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2 వేల 887 మంది చనిపోయారు.

India Covid-19 : భారత్‌లో తగ్గుతున్న కరోనా కేసులు, మరణాలు

India

India Covid 19 Cases : భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు ఇంకా నమోదవుతున్నాయి. అయితే..గతంలో నమోదైన కేసుల కంటే..ఇప్పుడు తక్కువగా నమోదు కావడం ఊరటనిస్తోంది. కొత్తగా 1,34,154 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2 వేల 887 మంది చనిపోయారు. దేశంలో 6 శాతానికి పాజిటివిటి రేటు తగ్గింది. పది రోజులుగా 10 శాతానికి దిగువన పాజిటివిటి రేటు రికార్డవుతోంది.

20 రోజులుగా కొత్త కేసులకన్నా అధికంగా రికవరీ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 2,84,41,986 కరోనా కేసులు రికార్డవగా..37,989 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 17,13,413 యాక్టివ్ కేసులు ఉండగా..2,63,90,584 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఐదు రాష్ట్రాల్లో మాత్రం లక్షకు పైగా యాక్టివ్ కేసులున్నాయి. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అధికంగా కేసులున్నాయి.

ఒక్క రోజులో 80,232 యాక్టివ్ కేసులు తగ్గాయి. 2,11,499 లక్షల మంది కోలుకున్నారు. 92.79 శాతానికి పైగా కరోనా రికవరీ రేటు నమోదు కాగా..6.02 శాతం యాక్టివ్ కేసులు.. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది.

Read More :  గుడ్ న్యూస్: ఏపీలో నెరవేరబోతున్న పేదోడి కల