COVID-19 Cases: దేశంలో కొత్తగా 11,692 కరోనా కేసులు

COVID-19 Cases: దేశంలో కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 5,31,258కి చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4.48 కోట్ల (4,48,69,684)కు పెరిగినట్లు వివరించింది.

COVID-19 Cases: దేశంలో కొత్తగా 11,692 కరోనా కేసులు

Corona Virus

COVID-19 Cases: దేశంలో కొత్తగా 11,692 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇంతకుముందు రోజు నమోదైన కేసుల కంటే 7 శాతం కొత్త కేసుల్లో 7 శాతం తగ్గుదల కనపడింది. యాక్టివ్ కేసులు సంఖ్య 66,170కు పెరిగింది. కరోనా వల్ల దేశంలో 24 గంటల్లో మరో 28 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించింది.

దీంతో దేశంలో కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 5,31,258కి చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4.48 కోట్ల (4,48,69,684)కు పెరిగినట్లు వివరించింది. మొత్తం ఇన్ఫెక్షన్లో యాక్టివ్ కేసుల శాతం 0.15గా ఉన్నట్లు తెలిపింది. కొవిడ్ రికవరీ రేటు 98.67 శాతంగా నమోదైనట్లు చెప్పింది.

దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,42,72,256కు పెరిగినట్లు వివరించింది. దేశంలో చేపట్టిన వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 220.66 కోట్ల డోసులను వినియోగించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కొన్ని రోజుల నుంచి రోజువారీ కరోనా కేసుల సంఖ్య 10 వేలకు పైగా నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య అధికంగా ఉంటోంది. దేశంలో కేసులు పెరుగుతుండడంతో ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర సర్కారు అప్రమత్తం చేసింది. దేశంలో కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ కొనసాగుతోంది.

USA: అమెరికాలో కాల్పుల కలకలం.. ఆంధ్ర యువకుడి మృతి