ఎక్కువగా కరోనా దెబ్బతిన్న 10 దేశాలివే : 15లక్షలకు చేరువలో కేసులు,80వేలు దాటిన మరణాలు

  • Published By: venkaiahnaidu ,Published On : April 8, 2020 / 07:47 AM IST
ఎక్కువగా కరోనా దెబ్బతిన్న 10 దేశాలివే : 15లక్షలకు చేరువలో కేసులు,80వేలు దాటిన మరణాలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 1.5మిలియన్ మార్క్ కు దగ్గరలో ఉంది. అంటే కరోనా సోకినవారి సంఖ్య దాదాపు 15లక్షలుగా ఉంది. ఇక మరణాల విషయానికొస్తే 82వేలకు పైగా నమోదయ్యాయి. ఏప్రిల్-8,2020 మధ్యాహ్నాం నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 14లక్షల 32వేల 984గా ఉంది. అయితే ఇందులో కోలుకున్న వారి సంఖ్య  కేవలం 3లక్షల 2వేల 150గా ఉంది.

ఇక అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదయ్యాయి. అగ్రరాజ్యంలో కరోనా కేసుల సంఖ్య 4లక్షలు దాటింది. ఇక 1లక్షా 41వేల 942 కేసులతో రెండవ స్థానంలో స్పెయిన్ నిలిచింది. 1లక్షా 35వేల 586 కేసులతో ఇటలీ 3వ స్థానంలో నిలిచింది. 1లక్షా 7వేల 663 కేసులతో జర్మనీ నాల్గవ స్థానంలో నిలిచింది.

అయితే కరోనా కేసుల విషయంలో అగ్రారాజ్యమే అన్నిదేశాలకన్నా ముందున్నప్పటికీ,మరణాల విషయంలో మాత్రం ఇటలీనే ముందుంది. ఇటలీలో 17వేల 127 కరోనా మరణాలు ఇప్పటివరకు నమోదుకాగా,స్పెయిన్ లో 14వేల 045 మరణాలతో స్పెయిన్ రెండోస్థానంలో నిలిచింది. ఇక అమెరికాలో 12వేల 854 కరోనా మరణాలు నమోదుకాగా,ఫ్రాన్స్ లో 10వేల 328మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా మరణాల సంఖ్య 10వేలు దాటిన 4వ దేశంగా ఫ్రాన్స్ నిలిచింది. ఇక భారత్ లో కరోనా కేసుల సంఖ్య 5వేల మార్క్ దాటింది. ముఖ్యంగా మహారాష్ట్రలోనే 1000కి పైగా కేసులు నమోదయ్యాయి.              

కరోనాతో దారుణంగా ప్రభావితమైన 10దేశాలు

దేశం         కేసులు         మరణాలు    కోలుకున్నవారు    సీరియస్
అమెరికా      400,412        12.854         21,674                   9,169
స్పెయిన్     141,942          14,045         43,208               7,069
ఇటలీ         135,586         17,127          24,395                3,792
ఫ్రాన్స్         109,069         10,328          19,337                7,131
జర్మనీ        107,663         2,016            36,081                 4,895
చైనా          81,802           3,333            77,229                   189
ఇరాన్         62,589          3,872            27,039                 3,987
బ్రిటన్          55,242          6,159            135                    1,559
టర్కీ            34,109           725            1,582                    1,474
స్విట్జర్లాండ్     22,253          821             8,704                 391

తక్కువ యాక్టివ్ కరోనా కేసులున్న చైనా వైరస్ మొదట వెలుగులోకి వచ్చిన వూహాన్ సిటీలో 76రోజుల లాక్ డౌన్ ను ఎత్తివేసింది. వూహాన్ సిటీ ఉన్న హుబే ఫ్రావిన్స్ లో గత నెలలోనే ఆంక్షలను ఎత్తివేసినప్పటికీ వూహాన్ సిటీలో మాత్రం అప్పుడు ఎత్తివేయలేదు. ఇవాళ్టి నుంచి వూహాన్ లో కూడా లాక్ డౌన్ ఎత్తివేసినట్లు కమ్యూనిస్టు ప్రభుత్వం తెలిపింది. (అన్నయ్యతో ప్రేమ.. అడ్డుగా ఉందని సొంత అక్కనే చంపిన చెల్లెలు)