Corona effect on trees : చెట్లపై కరోనా వేటు..స్థలంలేక..వృక్షాలు తొల‌గించి..మృతదేహాల ఖననం

ఓ పక్క ప్రజలు కరోనా సోకి పిట్టల్లా రాలిపోతున్నారు. మరోపక్క ఈ కరోనా మహమ్మారి పచ్చని చెట్లపై కూడా ప్రభావాన్ని చూపిస్తోంది. కరోనా వైరస్ కల్లోలంతో రోజురోజుకు మరణాల సంఖ్య పెరుగుతుండటంతో మృతదేహాలను ఖననం చేసే స్థలం కూడా శ్మశానాల్లో ఉండటంలేదు. దీంతో శ్మశానాల్లో ఉండే చెట్లను తొలగించి ఆ స్థానంలో కరోనాతో చనిపోయినవారి మతదేహాలను ఖననం చేస్తున్న దుస్థితి చెన్నైలో చోటుచేసుకుంది.

Corona effect on trees : చెట్లపై కరోనా వేటు..స్థలంలేక..వృక్షాలు తొల‌గించి..మృతదేహాల ఖననం

Corona Efffect On Trees

Corona effect on trees : ఓ పక్క ప్రజలు కరోనా సోకి పిట్టల్లా రాలిపోతున్నారు. మరోపక్క ఈ కరోనా మహమ్మారి పచ్చని చెట్లపై కూడా ప్రభావాన్ని చూపిస్తోంది. అదేంటీ..కొన్ని రకాల జంతువులకు కరోనా వచ్చినట్లుగానే..చెట్లకు కూడా ఈ వైరస్ సోకుతోందా? అనే భయపడొచ్చు. కానీ..అసలు విషయం అది. కాదు..కరోనా వైరస్ కల్లోలంతో రోజురోజుకు మరణాల సంఖ్య పెరుగుతుండటంతో మృతదేహాలను ఖననం చేసే స్థలం కూడా శ్మశానాల్లో ఉండటంలేదు. దీంతో శ్మశానాల్లో ఉండే చెట్లను తొలగించి ఆ స్థానంలో కరోనాతో చనిపోయినవారి మతదేహాలను ఖననం చేస్తున్న దుస్థితి చెన్నైలో చోటుచేసుకుంది. అంటే కరోనా మరణాల సంఖ్య ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవటానికే గుండెలు హడలిపోతున్నాయి.

దేశ‌వ్యాప్తంగా బుధ‌వారం (మే 19,2021) ఒక్క‌రోజే అత్య‌ధికంగా 4,500కి పైగా మ‌ర‌ణాలు చోటుచేసుకున్నాయి. ఇక కొత్త కేసులు పెద్ద‌సంఖ్య‌లో న‌మోద‌వుతుండ‌టంతో ద‌వాఖాన‌లు రోగుల‌తో కిక్కిరిసి ఉండ‌గా మ‌హ‌మ్మారితో మ‌ర‌ణించిన వారికి అంత్య‌క్రియ‌లు జ‌రిపించేందుకు స్మ‌శాన‌వాటిక‌ల్లో స్థ‌లం కరువైంది. త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలోనూ ఇదే దుస్థితి నెల‌కొంది.

చెన్నైలో కిల్పాక్ సిమెట‌రీ, క‌సిమెడు సిమెట‌రీ, క్విబుల్ ఐలండ్ సిమెట‌రీ, సెంట్ మేరీస్ కార్పొరేష‌న్ సిమెట‌రీ వంటి ప్ర‌ముఖ క్రైస‌వ సిమెటరీల్లో కొవిడ్-19 రోగుల అంత్య‌క్రియ‌ల‌కు స్థ‌లం దొర‌క‌ని ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఆయా స్మ‌శాన వాటిక‌ల్లో మ‌రిన్ని మృతదేహాల‌కు అంత్య‌క్రియ‌లు చేప‌ట్టేలా స‌ర్ధుబాటు చేసేందుకు సిబ్బంది శ్మశానాల్లో ఉన్న చెట్ల‌ను తొల‌గించాల్సి వస్తోంది.

ఇటువంటి ప‌రిస్థితి ఎదుర‌వుతుంద‌ని ఎన్నడూ ఊహించ‌లేద‌ని సంబంధిత అధికారులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. పెద్ద సంఖ్య‌లో మృతదేహాలు అంత్య‌క్రియ‌ల‌కు పేరుకుపోవ‌డంతో వీటికోసం మ‌రింత స్ధ‌లం కేటాయించాల‌ని సీఎంకు విజ్ఞ‌ప్తి చేసేందుకు మ‌ద్రాస్ సిమెట‌రీస్ బోర్డ్ ట్ర‌స్ట్ యోచిస్తోంది. కాగా గత వారంలో సెయింట్ మేరీస్ కార్పొరేషన్ స్మశానవాటికలో 20 కరోనా మృతదేహాలను ఖననం చేశారు. అంటే మరణాల స్థాయి ఎలా ఉందో ఊహించుకోవచ్చు..