COVID Delta Variant : చికెన్ ఫాక్స్ లానే..కోవిడ్ డెల్టా వేరియంట్ వ్యాప్తి!

ఇప్పటివరకు తెలిసిన అన్ని కోవిడ్ వేరియంట్ల కంటే.. డెల్టా వేరియంట్ తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుందని మరియు చికెన్‌పాక్స్ లాగా ఇది చాలా సులభంగా వ్యాప్తి చెందుతుందని యుఎస్ హెల్త్ అథారిటీ అంతర్గ డాక్యుమెంట్ తెలియజేస్తున్నట్లు యుఎస్ మీడియా రిపోర్టులు చెబుతున్నాయి.

COVID Delta Variant : చికెన్ ఫాక్స్ లానే..కోవిడ్ డెల్టా వేరియంట్ వ్యాప్తి!

Cv

COVID Delta Variant ఇప్పటివరకు తెలిసిన అన్ని కోవిడ్ వేరియంట్ల కంటే.. డెల్టా వేరియంట్ తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుందని మరియు చికెన్‌పాక్స్ లాగా ఇది చాలా సులభంగా వ్యాప్తి చెందుతుందని యుఎస్ హెల్త్ అథారిటీ అంతర్గ డాక్యుమెంట్ తెలియజేస్తున్నట్లు యుఎస్ మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) డాక్యెమెంట్ ప్రకారం… పూర్తిగా వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులు డెల్టా వేరియంట్‌ను వ్యాప్తి చేసే అవకాశముంది. సీడీసీ డాక్యుమెంట్ లో కొంత సమాచారాన్ని గురువారం వాషింగ్టన్ పోస్ట్ పత్రిక బయటపెట్టింది.

డెల్టా వేరియంట్.. MERS, SARS, ఎబోలా, సాధారణ జలుబు, సీజనల్ ఫ్లూ మరియు స్మాల్ ఫాక్స్ కి కారణమయ్యే వైరస్‌ల కంటే ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని..చికెన్ ఫాక్స్ మాదిరిగానే డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందుతుందని పబ్లిష్ చేయని సీడీసీ నివేదిక తెలియజేస్తోంది. B.1.617.2గా పిలువడే డెల్టా వేరియంట్ తీవ్రమైన అనారోగ్యాలకు కారణమవుతుందని సీడీసీ డాక్యుమెంట్ పేర్కొంది. వ్యాక్సిన్ తీసుకోనివారికి, రెండు డోసుల టీకా తీసుకున్నవారికి కూడా డెల్టా వేరియంట్ సోకే అవకాశాలు సమానస్థాయిలో ఉన్నాయని సీడీసీ తన పత్రాల్లో పేర్కొంది. వైరస్​పై పోరు మారిందని ప్రకటించడమే తామిక చేయాల్సిన పని అని ఈ పత్రాల్లో సీడీసీ పేర్కొంది.