చెట్ల కింద అసెంబ్లీ సమావేశాలు…ఎక్కడ ? ఎందుకు ?

  • Published By: madhu ,Published On : July 26, 2020 / 09:00 AM IST
చెట్ల కింద అసెంబ్లీ సమావేశాలు…ఎక్కడ ? ఎందుకు ?

చెట్ల కింద అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం ఎక్కడైనా చూశారా ? కానీ అలాంటి సీన్ ఆ రాష్ట్రంలో కనిపించింది. ఆరు బయట కుర్చీలు, టేబుళ్లు వేసుకుని అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎదురెదురు కూర్చొగా.. వారి ముందట..కుర్చీలో స్పీకర్ ఛైర్ లో కూర్చొని సమావేశాలు నిర్వహించారు. దీనికి సంబంధించిన వార్తలు, ఫొటోలు సోషల్ మీడియలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీనికంతటికి కారణం ఏంటంటే..ఓ ఎమ్మెల్యేకు కరోన వైరస్ సోకడమే.

Puducherry, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆల్ ఇండియా ఎన్.ఆర్ కాంగ్రెస్ పార్టీ (All India N R Congress (AINRC)కి చెందిన ఎమ్మెల్యే ఎస్.ఎస్.జె.జయబాల్ కు కరోనా పరీక్షలు చేయించుకోగా..పాజిటివ్ వచ్చిందని తేలింది. దీంతో అసెంబ్లీలో కలవరం మొదలైంది. దీంతో ఆయన్ను హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వెంటనే అసెంబ్లీని శానిటైజ్ చేయాల్సి వచ్చింది. కానీ..సమావేశాలు ఎక్కడ నిర్వహించాలనే దానిపై సందిగ్ధత నెలకొంది.

సమావేశాలపై స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భౌతిక దూరం పాటిస్తూ…సమావేశాలను ఆరు బయట నిర్వహిస్తామని చెప్పారు. వెంటనే చక..చక ఏర్పాట్లు చేసేశారు. రూ. 9 వేల కోట్ల బడ్జెట్ ను ఎలాంటి చర్చ లేకుండా…ఆమోదించిన తర్వాత సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు.

2020, జులై పుదుచ్చేరి అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. తొలి రెండు రోజులు ఎమ్మెల్యే జయబాల్ పాల్గొన్నారు. బడ్జెట్ రోజున..మిగతా ఎమ్మెల్యేలతో కలిసి ఆయన వాకౌట్ చేశారు. జయబాల్ కు కరోనా పాజిటివ్ రావడంతో..ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారు..హోం ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు.