Booster Dose: భారత్‌లో బూస్టర్ డోస్.. నేడే నిర్ణయం!

రెండేళ్లుగా ప్రపంచ మానవాళికి కునుకులేకుండా చేసిన కరోనా మహమ్మారిని అరికట్టేందుకు దేశదేశాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సాగిస్తున్నాయి.

Booster Dose: భారత్‌లో బూస్టర్ డోస్.. నేడే నిర్ణయం!

Booster Dose

Booster Dose: రెండేళ్లుగా ప్రపంచ మానవాళికి కునుకులేకుండా చేసిన కరోనా మహమ్మారిని అరికట్టేందుకు దేశదేశాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సాగిస్తున్నాయి. భారత్‌లో కూడా పూర్తిగా కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత అధికారులు, వైద్యులు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. ఈ సమయంలో ఒమిక్రాన్ రూపంలో కరోనా మహమ్మారి ప్రళయ తాండవం చేసేందుకు సిద్ధమైంది.

రాబోయే రోజుల్లో ఒమిక్రాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది అని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో రెండు డోసులు ఇచ్చిన తర్వాత బూస్టర్ డోసులు ఇస్తుంది. ఇప్పుడు భారత్‌లో కూడా బూస్టర్ డోసుపై నిపుణులు చర్చిస్తున్నారు. కోవిడ్-19 ఇమ్యునైజేషన్‌పై భారత నిపుణుల ప్యానెల్ సోమవారం(6 డిసెంబర్ 2021) చర్చిస్తోంది. అదనపు డోసు వ్యాక్సిన్‌పై నిర్ణయం తీసుకుంటుంది.

బూస్టర్ డోసును దశలవారీగా అమలు చేసే అవకాశం కనిపిస్తుంది. హై-రిస్క్ ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తూ.. బూస్టర్ డోసు ఇవ్వాలని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (NTAGI) సూచించవచ్చు. కోవిడ్-19 వ్యాక్సినేషన్‌తో సహా ఇమ్యునైజేషన్‌కు సంబంధించిన సమస్యలపై కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చే ఈ ప్యానెల్, 18 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్‌కీ సంబంధించిన సమగ్ర విధానంపై పని చేస్తోంది.

రోగనిరోధక శక్తి తగ్గిన వ్యక్తులు.. అంటే ధీర్ఘకాలిక వ్యాధులు ఎక్కువ ప్రమాదంలో ఉన్నందున ఎక్స్‌ట్రా ప్రొటెక్షన్ కోసం బూస్టర్ డోసు తీసుకోవడం తప్పదనే అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికి ప్రభుత్వం బూస్టర్ డోసు గురించి ఆలోచించట్లేదు అని తెలుస్తుంది. ఎందుకంటే అర్హులందరికీ వీలైనంత వేగంగా వ్యాక్సిన్లు వేయడానికి ప్రాధాన్యత ఇస్తుంది ప్రభుత్వం.

కోవిడ్-19కి వ్యతిరేకంగా పిల్లలకు వ్యాక్సిన్ వేసే విషయాన్ని కూడా NTAGI ఆలోచిస్తుంది. పిల్లలకు వ్యాక్సిన్లు వేయడం గురించి ప్రారంభించడంపై ఏకాభిప్రాయం వచ్చినప్పటికీ, దశలవారీగా కసరత్తు నిర్వహించే అవకాశం ఉందని, మొదటి దశలో అనారోగ్యాలతో బాధపడుతున్న పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చే విషయమై ఏకాభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది.