Corona Third wave: కరోనా మూడో వేవ్ ప్రభావం పిల్లలపై తక్కువే.. ఆరు రోజులే లక్షణాలు

సెకండ్ వేవ్ దాదాపుగా మందగించిన కొంతకాలానికి కరోనా థ‌ర్డ్ వేవ్ హెచ్చరికలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. కంటి మీద కనుకు లేకుండా చేస్తుండగా.. ముఖ్యంగా ఈ మూడో వేవ్ తో పిల్ల‌లకు ముప్పు పొంచి ఉందనే వార్త‌లు తల్లిదండ్రులను భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేస్తున్నాయి.

Corona Third wave: కరోనా మూడో వేవ్ ప్రభావం పిల్లలపై తక్కువే.. ఆరు రోజులే లక్షణాలు

Covid

COVID-19 in Children: సెకండ్ వేవ్ దాదాపుగా మందగించిన కొంతకాలానికి కరోనా థ‌ర్డ్ వేవ్ హెచ్చరికలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. కంటి మీద కనుకు లేకుండా చేస్తుండగా.. ముఖ్యంగా ఈ మూడో వేవ్ తో పిల్ల‌లకు ముప్పు పొంచి ఉందనే వార్త‌లు తల్లిదండ్రులను భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేస్తున్నాయి. ఫస్ట్ వేవ్ వృద్ధుల‌పై ప్ర‌భావం చూపగా.. రెండో వేవ్‌లో యువ‌కులు బాధితుల‌య్యార‌ని.. ఇక మూడో వేవ్‌లో క‌రోనా ర‌క్క‌సి చిన్న పిల్ల‌ల‌నే కాటేస్తుంద‌నే ప్రచారం సాగుతోంది.

ఈ క్రమంలో చిన్నపిల్లలపై కరోనా ప్రభావాన్ని అంచనా వేసేందుకు యూకేలో భారీ అధ్యయనం జరిగింది. కోవిడ్‌ సోకిన చిన్నారుల్లో అత్యధిక శాతం మందిలో కరోనా లక్షణాలు ఆరు రోజులకు మించి ఉండట్లేదని ఈ అధ్యయనం స్పష్టం చేస్తుంది. లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. పెద్ద‌ల‌తో పోలిస్తే పిల్ల‌ల్లో కొవిడ్ తీవ్ర‌త త‌క్కువ‌గానే ఉంటుంద‌ని, కొవిడ్-19 అనంత‌రం వ‌చ్చే దుష్ప్ర‌భవాలు మాత్రం పిల్ల‌ల్లో ఎక్కువ‌గా క‌నిపించే అవ‌కాశం ఉందని అంటున్నారు. ఈ పరిశోధనను లండన్‌లోని కింగ్స్‌ కాలేజ్‌ నిపుణులు 2020 సెప్టెంబర్‌ 1 నుంచి 2021 ఫిబ్రవరి 22 వరకూ జరిపారు.

జోయ్‌ కోవిడ్‌ స్టడీ అనే స్మార్ట్‌ ఫోన్‌ యాప్‌ ద్వారా చిన్నారుల తల్లిదండ్రులు, టీనేజర్ల నుంచి తీసుకున్న సమాచారం ప్రకారం.. పదిహేడేళ్ల లోపు రెండున్నర లక్షల మంది యూకే చిన్నారుల మీద అధ్యయనం చేయగా.. కరోనా సోకిన చాలా మంది చిన్నారుల్లో లక్షణాలు లేవని స్పష్టం అయ్యింది. మొత్తంమీద అధిక శాతం చిన్నారులు కేవలం నాలుగు వారాల్లో పూర్తిగా కోలుకున్నారని, పరిశోధనలో పాల్గొన్న ప్రొఫెసర్‌ ఎమ్మా చెప్పారు.

పరిశోధనలో పాల్గొన్న తల్లిదండ్రులు చెప్పిన వివరాల ప్రకారం.. కోవిడ్ సోకినవారిలో దాదాపుగా 84శాతంకి పైగా నీరసం మాత్రమే లక్షణంగా కనిపించింది. కరోనా సోకి కోలుకున్న తర్వాత మాత్రం జలుబు ఎక్కువగా కనిపించిందని, ఆరు రోజులు మాత్రమే కొందరిలో లక్షణాలు కనిపించాయని కూడా వారు చెబుతున్నారు.