22 covid bodies in ambulance : ఒకే అంబులెన్స్‌లో మూటలు కట్టిన 22 మంది కరోనా మృతదేహాలు..!

22 covid bodies in ambulance : ఒకే అంబులెన్స్‌లో మూటలు కట్టిన 22 మంది కరోనా మృతదేహాలు..!

22 Covid Bodies In Ambulance

Covid 19 in India Maharashtra : భారత్ లో కరోనా కరాళ నృత్యం ఎంత దారుణంగా ఉందో తెలిపే ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. కరోనాతో చనిపోయివారి మృతదేహాలను తరలింపు విషయంలో చోటుచేసుకున్న ఒకే అంబులెన్స్‌లో 22 మంది మృతదేహాలను తరలించిన ఘటన చూస్తే భారత్ లో కరోనా ప్రభావం ఎంతగా భారీగా ఉందో ఈ దయనీయ స్థితి చూస్తే అర్థమవుతోంది. కరోనా కేసుల విషయంలో దేశం అంతా ఒక ఎత్తు ఒక్క మహారాష్ట్ర ఒక ఎత్తు అన్నట్లుగా ఉంది పరిస్థితి.

లాక్‌డౌన్ వల్ల వైరస్ జోరు కాస్తంత తగ్గినా కరోనా మరణాలు మాత్రం ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి బీడ్ జిల్లాలోని అంబాజోగాయ్‌లో ఓ అంబులెన్స్‌లో ఏకంగా 22 మంది కరోనా మృతదేహాలను తరలించిన పరిస్థితి చూస్తే. ఆస్పత్రిలో కరోనాతో చనిపోయినవారి మతదేహాలకు అంత్యక్రియలు జరిపేందుకు అలా ఒకే అంబులెన్స్ లో ఏకంగా 22 మతదేహాలను తరలించారు. వాస్తవానికి అంబులెన్స్‌లో ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఒక మృతదేహాన్నే తరలిస్తారు. కానీ… ఇక్కడ పరిస్థితి వేరుగా ఉంది అనేకంటే అత్యంత దారుణంగా ఉందని చెప్పాల్సి ఉంది. ఏకంగా 22 డెడ్ బాడీలను ఎందుకు తరలించారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఉలిక్కిపడిన బీడ్ జిల్లా అధికార యంత్రాంగం… హడావుడిగా అంబాజోగాయ్‌కి ఓ టీమ్‌ని పంపింది. జిల్లా నుంచి ఆ ఏరియా 220 కిలోమీటర్ల దూరంలో ఉంది.

మృతదేహాలకు సంబంధించిన బంధువుల్లో కొందరు మొబైల్ ఫోన్లతో ఆ అంబులెన్స్‌ని ఫొటోలు, వీడియో తీస్తుంటే… తమను పోలీసులు అడ్డుకొని మొబైల్స్ లాక్కున్నారని..అంత్యక్రియలు పూర్తైన తర్వాతే ఫోన్లు వెనక్కి ఇచ్చారని తెలిపారు. ఇది చూసిన మరో వ్యక్తి ఇది నిజమేనని తెలిపాడు.

అధికారులు మాత్రం ఇది ఏమంత పెద్ద విషయం కాదని కొట్టిపడేస్తున్నారు. ప్రతి మృతదేహాన్నీ బాడీ బ్యాగుల్లో ప్యాక్ చేశామని.ఆ బాడీలను అంబాజోగాయ్‌లోని స్వామి రామనంద తీర్థ మరాట్వాడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ (SRTMGMC) మార్చురీ నుంచి తీసుకొచ్చినట్లు తెలిపారు.

మృతుల సంబంధీకుల్లో ఒకరు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇలా ఒకే అంబులెన్స్ లో 22 డెడ్ బాడీలు తరలించడమే కాకుండా..అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామని తేలిగ్గా మాట్లాడుతున్నారని వాపోయారు. ఈ ఘటనపై SRTMGMC డీన్‌ డాక్టర్ శివాజీ సుక్రేని మాట్లాడుతూ..ఇక్కడ రెండు అంబులెన్సులు మాత్రమే అంత్యక్రియలకు తరలించడానికి ఉన్నాయి. అవసరానికి సరిపడా లేవు. అంబాజోగాయ్ సివిక్ బాడీ అధికారులకు మృతదేహాలను అంత్యక్రియల కోసం అప్పగించడమే మా పని. సివిక్ బాడీ ఏం చేస్తుందన్నది మాకు అనవసరం” అని తెలిపారు.

మరోపక్క అంబాజోగాయ్ సివిక్ బాడీ కూడా తాము చేయగలిగింది ఏమీ లేదని చెబుతోంది. తమకు అంబులెన్సులు, మాన్ పవర్ అన్నీ తక్కువగానే ఉన్నాయని..కానీ మృతుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఉన్న అంబులెన్సులు సరిపోవటంలేదని చెబుతోంది. ఇదీ ఇండియాలో మరి ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా ఎంతలా విలయతాండవం చేస్తోందో చెబుతున్న ప్రత్యక్ష ఘటనగా చెప్పుకోవాలి.