Covid-19 India : భారతదేశంలో తగ్గుతున్న కరోనా కేసులు, మరణాలు

భారతదేశాన్ని గజగజలాడించిన కరోనా వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కేసుల సంఖ్య గణనీయంగా పడిపోతోంది. మరణాల సంఖ్య కూడా అదే విధంగా ఉండడంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. గతంలో లక్షల సంఖ్యలో నమోదైన పాజిటివ్ కేసులు ఇప్పుడు కంట్రోల్ లోకి వచ్చాయి.

Covid-19 India : భారతదేశంలో తగ్గుతున్న కరోనా కేసులు, మరణాలు

India Corona

Covid-19 India : భారతదేశాన్ని గజగజలాడించిన కరోనా వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కేసుల సంఖ్య గణనీయంగా పడిపోతోంది. మరణాల సంఖ్య కూడా అదే విధంగా ఉండడంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. గతంలో లక్షల సంఖ్యలో నమోదైన పాజిటివ్ కేసులు ఇప్పుడు కంట్రోల్ లోకి వచ్చాయి.

దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ పంపిణీ జోరుగా కొనసాగుతుండడం, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిబంధనలు ఆంక్షలు విధించడంతో వైరస్ కు చెక్ పెట్టినట్లైంది. తాజాగా..భారత్ లో కొత్తగా 58 వేల 419 కరోనా కేసులు వెలుగు చూశాయి. వేయి 576 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం 7 లక్షల 29 వేల 243 యాక్టివ్ కేసులుండగా..3 లక్షల 86 వేల 713 మంది చనిపోయారు.

కొత్తగా 87 వేల 619 మంది కోవిడ్ తో కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్ నుంచి బయటపడిన వారి సంఖ్య 2,87,66,009గా ఉంది.
ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 7,29,243కి తగ్గి..ఆ రేటు 2.44 శాతానికి చేరింది.
మొత్తంగా 27,66,93,572 టీకా డోసులను కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పంపిణీ చేసింది.