COVID-19: దేశంలో కొత్తగా 10,256 కరోనా కేసులు.. నిన్న 31,60,292 డోసుల వ్యాక్సిన్ల వినియోగం

దేశంలో కొత్తగా 10,256 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా నుంచి 13,528 మంది కోలుకున్నారని పేర్కొంది. దేశంలో ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో 90,707 మంది చికిత్స తీసుకుంటున్నారని చెప్పింది. కరోనా కారణంగా దేశంలో ఇప్పటివరకు 5,27,556 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది.

COVID-19:  దేశంలో కొత్తగా 10,256 కరోనా కేసులు.. నిన్న 31,60,292 డోసుల వ్యాక్సిన్ల వినియోగం

COVID-19

COVID-19: దేశంలో కొత్తగా 10,256 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా నుంచి 13,528 మంది కోలుకున్నారని పేర్కొంది. దేశంలో ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో 90,707 మంది చికిత్స తీసుకుంటున్నారని చెప్పింది. కరోనా కారణంగా దేశంలో ఇప్పటివరకు 5,27,556 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 4,37,70,913కు పెరిగిందని చెప్పింది.

దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.61 శాతంగా ఉందని పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.43 శాతంగా ఉందని తెలిపింది. వారాంతపు పాజిటివిటీ రేటు 3.02 శాతంగా ఉన్నట్లు చెప్పింది. ఇప్పటివరకు చేసిన కరోనా పరీక్షల సంఖ్య 88.43 కోట్లకు పెరిగిందని పేర్కొంది. నిన్న దేశంలో 4,22,322 కరోనా పరీక్షలు చేసినట్లు చెప్పింది.

దేశంలో ఇప్పటివరకు మొత్తం 211.13 కోట్ల వ్యాక్సిన్ డోసులు వినియోగించారు. వాటిలో రెండో డోసులు 94.12 కోట్లు ఉన్నాయి. బూస్టర్ డోసులు 14.76 కోట్లు ఉన్నాయి. నిన్న దేశంలో 31,60,292 డోసుల వ్యాక్సిన్లు వేశారు.

Viral video: కొడుకుని ఎత్తుకుని రిక్షా తొక్కుతున్న తండ్రి.. కన్నీరు పెట్టిస్తోన్న వీడియో