COVID-19: దేశంలో కొత్తగా 7,219 కరోనా కేసులు నమోదు.. నిన్న 3,64,886 కొవిడ్ పరీక్షలు

దేశంలో కొత్తగా 7,219 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, కరోనా నుంచి నిన్న 9,651 మంది కోలుకున్నట్లు వివరించింది. మొన్న 59,210గా ఉన్న యాక్టివ్ కేసులు నిన్న 56,745కి తగ్గాయని వివరించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.98 శాతంగా ఉన్నట్లు చెప్పింది. వారాంతపు పాజిటివిటీ రేటు 2.42 శాతంగా ఉన్నట్లు చెప్పింది.

COVID-19: దేశంలో కొత్తగా 7,219 కరోనా కేసులు నమోదు.. నిన్న 3,64,886 కొవిడ్ పరీక్షలు

COVID-19: దేశంలో కొత్తగా 7,219 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, కరోనా నుంచి నిన్న 9,651 మంది కోలుకున్నట్లు వివరించింది. మొన్న 59,210గా ఉన్న యాక్టివ్ కేసులు నిన్న 56,745కి తగ్గాయని వివరించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.98 శాతంగా ఉన్నట్లు చెప్పింది. వారాంతపు పాజిటివిటీ రేటు 2.42 శాతంగా ఉన్నట్లు చెప్పింది.

ఇప్పటివరకు దేశంలో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,27,965కు చేరుకుందని వివరించింది. దేశంలో రికవరీ రేటు ప్రస్తుతం 98.68 శాతంగా ఉందని చెప్పింది. ఇప్పటివరకు కోలుకున్న కేసుల సంఖ్య 4,38,65,016కు చేరిందని వివరించింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం కలిపి 88.68 కోట్ల కరోనా పరీక్షలు చేసినట్లు తెలిపింది.

నిన్న 3,64,886 కరోనా పరీక్షలు చేసినట్లు పేర్కొంది. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 213.01 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వాడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. వాటిలో రెండో డోసులు 94.31 కోట్లు ఉన్నట్లు పేర్కొంది. బూస్టర్ డోసులు 16.38 కోట్లు ఉన్నట్లు చెప్పింది. గత 24 గంటల్లో 25,83,815 కరోనా డోసులు వినియోగించినట్లు పేర్కొంది.

Rains in telangana: తెలంగాణలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం