India’s Vaccination : భారత్ మరో ఘనత..50శాతం మందికి పైగా వ్యాక్సినేషన్ పూర్తి

కోవిడ్ వ్యాక్సినేషన్ లో భారత్‌ మరో ఘనతను సాధించింది. దేశంలో అర్హులైన జనాభాలో..50శాతం మందికిపైగా రెండు డోసుల కొవిడ్‌ టీకాలు వేసినట్లు ఆదివారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి

India’s Vaccination : భారత్ మరో ఘనత..50శాతం మందికి పైగా వ్యాక్సినేషన్ పూర్తి

Vaccine (1)

India’s Vaccination :  కోవిడ్ వ్యాక్సినేషన్ లో భారత్‌ మరో ఘనతను సాధించింది. దేశంలో అర్హులైన జనాభాలో..50శాతం మందికిపైగా రెండు డోసుల కొవిడ్‌ టీకాలు వేసినట్లు ఆదివారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఆదివారం తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.” అర్హత గల వారిలో 50శాతానికిపైగా వయోజనులు రెండు డోసులు తీసుకోవడం గొప్ప విషయం. మరో మైలురాయిని చేరుకున్నందుకు భారతదేశానికి అభినందనలు. కరోనా మహమ్మారిపై పోరులో మనమంతా కలిసే విజయం సాధిస్తాం”అని ట్వీట్ లో మన్‌సుఖ్‌ మాండవీయ పేర్కొన్నారు.

ఆదివారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 127.66కోట్ల కొవిడ్​ వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో 84.4 మంది ఇప్పటి వరకు కనీసం ఒక డోసు తీసుకున్నారని వివరించింది. ఇప్పటి వరకు 47.59కోట్ల మంది రెండు డోసులూ పూర్తి చేసుకున్నారు. శనివారం ఒక్క రోజే కోటి డోసులు ఇచ్చినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఒక్క రోజులో కోటి వ్యాక్సిన్లు పంపిణీ చేయడం ఇది ఆరోసారి అని పేర్కొంది. ఇదిలా ఉండగా, దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,895 కరోనా కేసులు నమోదవగా.. 2,796 మరణాలు నమోదయ్యాయి.

కాగా,ఈ ఏడాది జనవరిలో దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. మొదట్లో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు ప్రాధాన్యతనిచ్చి వ్యాక్సినేషన్‌ చేపట్టారు. ఆ తర్వాత క్రమంగా ప్రజలందరికీ వ్యాక్సిన్‌ వేయడం మొదలైంది. అక్టోబర్‌ నెలలో 100కోట్ల వ్యాక్సినేషన్‌ మైలు రాయిని భారత్ చేరుకుంది. దేశంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. కోవిడ్ వ్యాక్సిన్‌లను ఇంటింటికీ తీసుకెళ్లి ప్రజలకు అందించాల్సిన అవసరముందని ఇటీవల అధికారులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారు

ALSO READ Omicron Corona Virus : తెలంగాణలో ఒమిక్రాన్ వార్తలపై హెల్త్ డైరెక్టర్ కీలక ప్రకటన