Lockdown In Delhi : వ్యాక్సిన్ వద్దు..అల్కాహాల్ మంచిది..మందుషాపులు తెరిచి ఉంచండి

వ్యాక్సిన్ కంటే ఆల్కాహాల్ మంచిదని ఓ మహిళ చెబుతోంది. ఇంజక్షన్ వల్ల ఉపయోగం లేదంటోంది. ఎంత తాగితే అంత బావుంటారని, కనీసం మందుషాపులైనా తెరిచి ఉంచాలని విజ్ఞప్తి చేస్తోంది.

Lockdown In Delhi : వ్యాక్సిన్ వద్దు..అల్కాహాల్ మంచిది..మందుషాపులు తెరిచి ఉంచండి

COVID-19 Injection

COVID-19 Injection : వ్యాక్సిన్ కంటే ఆల్కాహాల్ మంచిదని ఓ మహిళ చెబుతోంది. ఇంజక్షన్ వల్ల ఉపయోగం లేదంటోంది. ఎంత తాగితే అంత బావుంటారని, కనీసం మందుషాపులైనా తెరిచి ఉంచాలని విజ్ఞప్తి చేస్తోంది. ఎందుకంటే..దేశ రాజధాని ఢిల్లీలో లాక్ డౌన్ పై సీఎం కేజ్రీవాల్ కీలక ప్రకటన చేయడంతోనే..మందుబాబులు ముందు చూపు ప్రదర్శిస్తున్నారు. లిక్కర్ షాపుల ఎదుట జనం గుమిగూడారు. మద్యం కోసం బారులు తీరారు.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కాటన్ల కొద్ది లిక్కర్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఆరు రోజులకు సరిపదా మద్యాన్ని వెంట తీసుకెళ్తున్నారు. అయితే.. మద్యం కావాలన్న ఆతృతతో… అందరూ కరోనా నిబంధనలను గాలికొదిలేశారు. మాస్కులు, భౌతికదూరం పాటించకుండా మద్యం కోసం ఎగబడుతున్నారు.

ఢిల్లీలో అంతకంతకూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2021, ఏప్రిల్ 19వ తేదీ సోమవారం రాత్రి 10 గంటల నుంచి 2021, ఏప్రిల్ 26వ తేదీ సోమవారం ఉదయం 5 గంటలవరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీలో కరోనా నాలుగో వేవ్ కొనసాగుతోంది. ఆక్సీజన్ కొరత ఏర్పడింది. ఆసుపత్రుల్లో బెడ్లు నిండుకున్నాయి. దీంతో కష్టమైనా లాక్ డౌన్ విధించాల్సి వచ్చింది.

Read More : East Godavari : మొదటి భార్య చెవులు, ముక్కులు కోశాడు..రెండో భార్య చేతిని సలసలాకాగే నూనెలో పెట్టించాడు