COVID-19: వ్యాక్సిన్ వేసుకుంటే ఆస్పత్రిలో ఖర్చు కూడా తగ్గుతుంది -అధ్యయనం

రెండు డోసుల వ్యాక్సిన్‌లు వేసుకున్నవారికి ఐసీయూలోకి వెళ్లే రిస్క్ 66 శాతం తక్కువగా ఉందని, మరణించే రిస్క్ 81శాతం తక్కువగా ఉందని సర్వే వెల్లడించింది.

COVID-19: వ్యాక్సిన్ వేసుకుంటే ఆస్పత్రిలో ఖర్చు కూడా తగ్గుతుంది -అధ్యయనం

Vaccine

COVID-19: రెండు డోసుల వ్యాక్సిన్‌లు వేసుకున్నవారికి ఐసీయూలోకి వెళ్లే రిస్క్ 66 శాతం తక్కువగా ఉందని, మరణించే రిస్క్ 81శాతం తక్కువగా ఉందని సర్వే వెల్లడించింది. వ్యాక్సిన్ వేసుకున్న వ్యక్తులకు COVID-19 వచ్చినా కూడా చికిత్సకు తక్కువ ఖర్చులే అయ్యాయని, వైరస్ కారణంగా ఆసుపత్రిలో కూడా తక్కువ రోజులే ఉన్నారని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అధ్యయనం తెలిపింది.

ఆరోగ్య భీమా పరిధిలో COVID-19 నిర్ధారణతో మార్చి మరియు ఏప్రిల్ 2021 మధ్యకాలంలో చికిత్స చేయించుకున్న రోగుల డేటా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ నుండి సేకరించినట్లు డేటా-బేస్ వెల్లడించింది.

వ్యాక్సిన్ తీసుకున్నవారులో సగటున ఏడు రోజుల్లో కోలుకున్నారని, వ్యాక్సిన్‌లు రెండవ మోతాదు తీసుకున్న పద్నాలుగు రోజుల తరువాత ఆసుపత్రిలో చేరినవాళ్లు కేవలం 4 రోజులు మాత్రమే ఆసుపత్రిలో ఉండే పరిస్థితి ఉన్నట్లు చెప్పుకొచ్చారు.

వ్యాక్సిన్‌లు వేయించుకోనివారిలో సగటున ఆసుపత్రి ఖర్చు రెండు లక్షల 77వేల 850గా ఉందని, టీకాలు వేయించుకున్నవారిలో సెకండ్ డోసు వేయించుకున్న తర్వాత పద్నాలుగు రోజుల తరువాత ఇది 2లక్షల 17వేల 850 రూపాయలగా ఉందని చెబుతున్నారు.

డేటా ప్రకారం అన్‌వాక్సినేటెడ్ రోగులలో మరణాలు 0.5 శాతం ఉండగా, 3,301మంది డేటాలో వ్యాక్సిన్ వేయించుకుని మరణించినవారు మాత్రం ఒక్కరు కూడా లేరని అధ్యయనం చెబుతుంది. దేశవ్యాప్తంగా 1,104 ఆస్పత్రులలో కోవిడ్ -19 చికిత్స చేయించుకున్న స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కస్టమర్ల అధ్యయనంలో ఆసుపత్రిలో చేరినవారు. ICU అవసరం పడినవారు ఖర్చులు తక్కువగానే ఉన్నట్లుగా అధ్యయనం చెబుతోంది.

వ్యాక్సిన్‌లు వేయించుకున్నవారిలో కొమొర్బిడిటీ ఉన్న రోగులకు ఐసీయూ అవసరం 9.4 శాతం నుండి 5 శాతానికి పడిపోయిందని, చికిత్స ఖర్చు కూడా దాదాపు 15 శాతం తగ్గిందని చెప్పారు. మూడో వేవ్ రాకుండా ఉండాలన్నా… వచ్చినా ప్రభావం తగ్గాలన్నా ప్రజలు వ్యాక్సిన్ చేయించుకోవడమే ఉత్తమమైన మార్గమని నిపుణులు చెబుతున్నారు.