Covid India: కరోనా కేసులు తగ్గుతున్నా.. మరణాలు తగ్గట్లేదు..

దేశంలో కరోనా మరణాలు ఆందోళన కలిగిస్తున్నా.. తగ్గుతున్న కేసులు, కోలుకుంటున్న వారి సంఖ్య చూస్తుంటే కాస్త హ్యాపీగా అనిపిస్తుంది. కానీ, కరోనా కారణంగా మరణాలు మాత్రం తగ్గట్లేదు.

Covid India: కరోనా కేసులు తగ్గుతున్నా.. మరణాలు తగ్గట్లేదు..

37190 Corona Cases In 24 Hours In Kerala

Corona Second Wave: దేశంలో కరోనా మరణాలు ఆందోళన కలిగిస్తున్నా.. తగ్గుతున్న కేసులు, కోలుకుంటున్న వారి సంఖ్య చూస్తుంటే కాస్త హ్యాపీగా అనిపిస్తుంది. కానీ, కరోనా కారణంగా మరణాలు మాత్రం తగ్గట్లేదు. దేశంలో వరుసగా ఐదవ రోజు కూడా మూడు లక్షల కన్నా తక్కువ కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య మాత్రం పెరిగింది. దేశంలో 24గంటల్లో కొత్తగా 2.59 లక్షల కరోనా కేసులు నమోదవగా.. కేసుల సంఖ్య 2.60 కోట్లకు చేరుకుంది. ఇదే సమయంలో 4వేల 209 మంది చనిపోయారు. ఏడు రోజులుగా కొత్త కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉంది.

ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, భారతదేశంలో కోవిడ్-19 కొత్త కేసుల సంఖ్య 2లక్షల 59వేల 591గా ఉంది. ఇప్పటివరకు 2,27,12,735 మంది ఈ వ్యాధి నుండి కోలుకోగా, గత 24 గంటల్లో 3,57,295 మంది కోలుకున్నారు. దేశంలో కొత్త కేసులు కంటే రికవరీ కేసులే ఎక్కువగా ఉన్నాయి. ఈ రేటు 87.25 శాతానికి పెరిగింది. కాగా మరణాల రేటు 1.12 శాతానికి పెరిగింది.

కరోనా వైరస్‌ను గుర్తించడానికి దేశంలో యుద్ధ ప్రాతిపదికన ప్రజలను విచారిస్తున్నారు. కరోనా ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించడానికి దేశంలో 20 లక్షల 61 వేల 683 నమూనాలను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) తెలిపింది. మొత్తం 32 కోట్ల 44 లక్షల 17 వేల 870 నమూనాలను ఇప్పటివరకు పరీక్షించారు. అదే సమయంలో, గత 24 గంటల్లో దేశంలో 14,82,754మందికి టీకాలు వేయగా.. దేశంలో మొత్తం టీకాలు వేయించుకున్నవారి సంఖ్య 19,18,79,503.