Indian States Lockdown: జూన్ 7 నుంచి లాక్‌డౌన్ ఆంక్షలు సడలిస్తున్న రాష్ట్రాలు ఇవే..

భారతదేశవ్యాప్తంగా రోజువారీ కొవిడ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. కరోనావైరస్ కేసులు తగ్గడంతో దేశంలోని పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ ఆంక్షలను సడలించడం ప్రారంభించాయి.

Indian States Lockdown: జూన్ 7 నుంచి లాక్‌డౌన్ ఆంక్షలు సడలిస్తున్న రాష్ట్రాలు ఇవే..

Covid 19 Lockdown These Indian States Ease Lockdown From Monday

Indian States Ease Lockdown : భారతదేశవ్యాప్తంగా రోజువారీ కొవిడ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. కరోనావైరస్ కేసులు తగ్గడంతో దేశంలోని పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ ఆంక్షలను సడలించడం ప్రారంభించాయి. కొవిడ్ లాక్‌డౌన్ పరిమితులను తగ్గించిన రాష్ట్రాల్లో, దేశ రాజధాని ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఉన్నాయి. మరోవైపు, వారపు పాజిటివిటీ రేటు, ఆక్సిజన్ బెడ్స్ ఆధారంగా లాక్‌డౌన్ సడలించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం 5-లెవల్ ప్లాన్ ప్రకటించింది. పాజిటివిటీ రేటు, జూన్ 3 ఆక్సిజన్ బెడ్ ఆక్యుపెన్సీ స్థాయి ఆధారంగా జూన్ 7 నుంచి అమల్లోకి వస్తుంది.

కొవిడ్ -19 లాక్‌డౌన్ సడలించిన రాష్ట్రాలివే..
మహారాష్ట్ర: మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా ఆంక్షల్లో 5-లెవల్ ప్లాన్ ప్రకటించింది. నోటిఫికేషన్ ప్రకారం.. ప్రతి మునిసిపల్ ప్రాంతం, జిల్లాను ప్రత్యేక పరిపాలనా విభాగంగా పరిగణించారు. లెవల్ 1 విభాగంలో 5శాతం పాజిటివిటీ రేటు, 25% కన్నా తక్కువ ఆక్సిజన్ బెడ్ ఆక్యుపెన్సీ ఉన్న నగరాలు, జిల్లాలు సాధారణ సమయాలతో పూర్తిగా తెరుచుకుంటాయి.

వ్యవసాయం, తయారీ రంగం, ఆర్థిక కార్యకలాపాలు కూడా అనుమతి ఉంటుంది. లెవల్-2 భాగంలో నగరాలు, జిల్లాలు పాజిటివిటి రేటు 5శాతం, ఆక్సిజన్ బెడ్ ఆక్యుపెన్సీ 25 నుంచి 40శాతంగా ఉంటుంది. అవసరం లేని షాపులను సాధారణ సమయాల ప్రకారం తెరిచేందుకు అనుమతి ఉంది. అయితే మాల్స్, థియేటర్లు, మల్టీప్లెక్సులు, ఆడిటోరియంలు, రెస్టారెంట్లు 50శాతం సామర్థ్యంతో పనిచేస్తాయి.

జిమ్‌లు, సెలూన్లు, బ్యూటీ సెంటర్లు 50శాతం సామర్థ్యంతో తెరుచుకోనున్నాయి. ప్రభుత్వ స్థలాలు, ప్రైవేట్ కార్యాలయాలు తెరుచుకోవచ్చు. 50శాతం సామర్థ్యంతో సామాజిక, రాజకీయ సమావేశాలు అనుమతి ఉంటుంది. కర్ఫ్యూ మాత్రం అమలులో ఉంటుంది.

ఢిల్లీ: దేశ రాజధానిలో షాపులు సోమవారం నుంచి తెరుచుకోనున్నాయి. జూన్ 7న ఢిల్లీ ప్రభుత్వం బేసి సంఖ్యలో కొన్ని షాపులు మరుసటి రోజు తెరుచుకోవడం, సరి సంఖ్యలో షాపులు ఒక రోజున తెరిచేందుకు అనుమతినిచ్చింది ప్రభుత్వం. మార్కెట్లు, మాల్స్ ఉదయం 10 నుంచి రాత్రి 8 వరకు తెరవడానికి అనుమతి ఉంటుంది. ప్రైవేట్ కార్యాలయాలు ఇప్పుడు సాధారణ సిబ్బంది స్థాయిలలో 50శాతంతో పనిచేయడానికి అనుమతినిచ్చింది. ఢిల్లీ మెట్రో కూడా జూన్ 7 నుంచి 50% సామర్థ్యంతో పని చేస్తుంది.

గుజరాత్: లాక్‌డౌన్ పరిమితిని కూడా గుజరాత్ ప్రభుత్వం సడలించింది. జూన్ 4 నుంచి దుకాణాలను తెరిచి ఉంచడానికి అనుమతించింది. రాష్ట్రంలోని 36 నగరాల్లోని అన్ని దుకాణాలను ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ప్రతిరోజూ రాత్రి 10 గంటల వరకు రెస్టారెంట్ల ద్వారా హోమ్ డెలివరీ చేయవచ్చని ప్రభుత్వం పేర్కొంది. అంతేకాకుండా, జూన్ 7 నుండి 100% సిబ్బందితో కార్యాలయాలు పనిచేసేందుకు గుజరాత్ అనుమతించింది.

ఉత్తర ప్రదేశ్: ఈ వారం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కరోనా యాక్టివ్ కేసులు 600 కన్నా తక్కువ నమోదైన జిల్లాల్లో ఆంక్షలను సడలించింది. ఆ జిల్లాల్లో, కంటైనర్ జోన్ల వెలుపల మార్కెట్లు, దుకాణాలు సోమవారం నుండి శుక్రవారం వరకు తెరిచి ఉంటాయి. ఏ ఫంక్షన్‌లోనైనా ఒకేసారి 25 కంటే ఎక్కువ అతిథులు అనుమతిలేదు.

అంత్యక్రియలకు 20 మందికి మించి పాల్గొనడానికి అనుమతిలేదు. ఆటో-రిక్షాలు, ఈ-రిక్షాల డ్రైవర్‌తో సహా గరిష్టంగా ముగ్గురు వ్యక్తులను అనుమతించింది.. నాలుగు చక్రాల వాహనాల్లో గరిష్టంగా నలుగురు వ్యక్తులకు అనుమతి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా వారాంతపు కర్ఫ్యూ, నైట్ కర్ఫ్యూ ఎప్పటిలానే కొనసాగుతుంది.

తమిళనాడు: తమిళనాడు కొవిడ్ లాక్‌డౌన్‌ను జూన్ 14 వరకు పొడిగించింది. అయితే చెన్నైతో సహా 27 జిల్లాల్లో లాక్ డౌన్‌ ఆంక్షలను సడలించింది. 27 జిల్లాల్లో కోవిడ్ లాక్‌డౌన్‌ను సడలించడం ద్వారా తమిళనాడు ప్రభుత్వం ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య కూరగాయలు, చేపలు, పండ్ల అమ్మకాలకు అనుమతి ఇచ్చింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు 30శాతం సిబ్బందితో అనుమతినిచ్చింది.

అయితే, ప్రధాన కర్మాగారాలు 50శాతం కార్మికులతో పనిచేయడానికి అనుమతి ఉంది. ఇక ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, వడ్రంగి హార్డ్వేర్ షాపులు, స్టేషనరీ షాపులు ఉదయం 6 నుండి సాయంత్రం 5 గంటల మధ్య పనిచేయడానికి అనుమతి ఉంది.

ఒడిశా: గత కొన్ని రోజులుగా కొవిడ్ కేసులు తగ్గడంతో ఒడిశా ప్రభుత్వం నువాపాడా, గజపతి, సుందర్‌గా జిల్లాల్లో లాక్ డౌన్ ఆంక్షలను తగ్గించింది. ఈ జిల్లాల్లో లాక్ డౌన్ విరామ సమయాన్ని ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు ఆరు గంటలకు పొడిగించింది ప్రభుత్వం.