COVID – 19 లాక్ డౌన్ : తెగ వాడేస్తున్నారు..చూస్తున్నారు

  • Published By: madhu ,Published On : March 28, 2020 / 01:48 AM IST
COVID – 19 లాక్ డౌన్ : తెగ వాడేస్తున్నారు..చూస్తున్నారు

భారతదేశ మంతా లాక్ డౌన్. ఎక్కడి వారెక్కడ ఉండాలని ప్రభుత్వాలు సూచన.  స్టేట్ ఎట్ హోమ్ అంటున్నాయి పాలకులు. కరోనా వ్యాపిస్తుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాయి. కేవలం 21 రోజుల పాటు ఇంటిలోనే ఉండిపోవాలని కోరారు. దీంతో చాలా మంది ఇంటి వద్దనే ఉండిపోతున్నారు. ఏమి చేయాలో వారికి పాలు పావడం లేదు.

కొంతమంది ఇంటి పనులు చేస్తుండగా..మరికొంతమంది పుస్తకాలు చదువుతూ..చిన్న పిల్లలతో ఆడుతూ కుటుంబ సభ్యులతో గడిపేస్తున్నారు. కానీ మరికొంత మంది మాత్రం టీవీలు, స్మార్ట పోన్లు చూస్తే కాలం గడిపేస్తున్నారు. ఇలా చూస్తున్న వారి సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోందని బార్క్ సంస్థ వెల్లడించింది. ఇందులో కరోనాకు సంబంధించిన వార్తలు తెలుసుకోవడానికి టీవీలు, ఎక్కడెక్కడ కేసులు నమోదయ్యాయి ? ఇతరత్రా విషయాలు తెలుసుకోవడానికి ఫోన్ లలో తెగ వెతుకుతున్నారంట. 

చైనాలో పుట్టిన ఈ వైరస్ ఖండాంతరాలను దాటింది. ఈ వైరస్ కారణంగా భారతదేశంతో పాటు..ఇతర దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. ఇళ్ల వద్దనే ఉన్న వారు..టీవీలు చూస్తున్నారు. మార్చి 14 నుంచి మార్చి 20వ తేదీ వరకు టెలివిజన్ వీక్షకుల సంఖ్య 6 శాతం పెరిగిపోయిందని బార్క్ వెల్లడించింది. అంటే సగటు వీక్షణ 2 శాతం పెరిగిందని అంచనా వేసింది.

కరోనా వైరస్ గురించి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి రెండోసారి చేసిన ప్రసంగాన్ని ఏకంగా 19.7 కోట్ల మంది టీవీల్లో చూశారని తెలిపింది. అందరూ ఇంట్లోనే ఉండడంతో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల సమయంలో చాలా మంది టీవీలు చూస్తున్నారని వెల్లడించింది. ఇందులో ఎక్కువగా వార్త ఛానళ్లు చూస్తున్నారని, ఏకంగా 57 శాతం పెరిగందని తెలిపింది. 

మరో వైపు స్మార్ట్ ఫోన్ లు చూస్తున్న వారి సంఖ్య కూడా పెరిగింది. సగటున 6.2 శాతం పెరిగిందని అంచనా వేసింది. సినిమాలు, పిల్లలకు సంబంధించిన ఛానళ్లకు అధికంగా ఇంప్రెషన్స్ లభిస్తున్నాయి. వార్తల యాప్స్ తెగ డౌన్ లోడ్ చేసేసుకుంటున్నారు. ఇది ఏకంగా 17 శాతం పెరిగిందని, ఛాటింగ్ 23 శాతం, సోషల్ వీడియోలు చూడడం 25 శాతం పెరిగియని తెలిపింది.

వీడియో ఆన్ డిమాండ్ యాప్స్ 3 శాతం, వార్తల యాప్స్ కు 8 శాతం డిమాండ్ పెరిగిందని అంచనా వేసింది. ఇక ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్, టిక్ టాక్ విషయాలు చెప్పనవసరం లేదు. ఒక్క వినియోగదారుడు చూసే సమయం గణనీయంగా పెరిగిందని బార్క్ అంచనా వేసింది. 

Also Read | రాజధానిలో రెడ్ జోన్ ప్రాంతాలివే..ఇంటికే రేషన్..వస్తువులు