మహారాష్ట్రలో వరుసగా రెండో రోజు 67వేలకు పైగా కరోనా కేసులు

మహారాష్ట్రలో వరుసగా రెండో రోజు 67వేలకు పైగా కరోనా కేసులు

Covid 19

COVID-19 దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. దేశవ్యాప్తంగా 3లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు, మ‌హారాష్ట్ర‌లో క‌రోనా తీవ్ర‌త ఆందోళ‌న రేపుతోంది. దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు, మ‌ర‌ణాల్లో మ‌హారాష్ట్ర తొలి స్థానంలో కొన‌సాగుతున్న‌ది.

మహారాష్ట్రలో గురువారం కొత్తగా 67,013 కరోనా వైరస్ కేసులు,568 మ‌ర‌ణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 40,94,840, మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 62,479కు చేరింది. మరోవైపు, మహారాష్ట్రలో గ‌త 24 గంట‌ల్లో 62,298 మంది క‌రోనా రోగులు కోలుకుని ఆసుప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో క‌రోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 33,30,747కు చేరిన‌ట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 6,99,858 యాక్టివ్ క‌రోనా కేసులు ఉన్న‌ట్లు పేర్కొంది. కాగా దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు, మ‌ర‌ణాల్లో మ‌హారాష్ట్ర తొలి స్థానంలో కొన‌సాగుతున్న‌ది. కరోనా కట్టడికి మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.