Fabiflu : ఫ్రీగా ఫాబిప్లూ ఇస్తానన్న గంభీర్.. అన్ని ఎక్కడవంటున్న కాంగ్రెస్, ఆప్

కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారిపోయింది.

Fabiflu : ఫ్రీగా ఫాబిప్లూ ఇస్తానన్న గంభీర్.. అన్ని ఎక్కడవంటున్న కాంగ్రెస్, ఆప్

Gautam Gambhir

Gautam Gambhir free Fabiflu shortage Covid drugs: కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారిపోయింది. ఉచితంగా ఫాబిప్లూ (Fabiflu) ఇస్తానని ఆయన ట్వీట్ లో వెల్లడించడంపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు మండిపడుతున్నాయి. జనాలకు ఫ్రీగా పంచి పెట్టేంత ఫాబిప్లూ ఎక్కడి నుంచి వచ్చిందంటూ..ప్రశ్నిస్తున్నాయి. ఇది అక్రమం కాదా అంటూ నిలదీస్తున్నాయి. తూర్పు ఢిల్లీకి చెందిన వాళ్లు ఎంపీ ఆఫీసుకు వెళ్లి ఫ్రీగా ఫాబిప్లూ తీసుకెళ్లవచ్చు..కేవలం ఆధార్ కార్డు, ప్రిస్కిప్షన్ చూపిస్తే..సరిపోతుందంటూ…గంభీర్ ట్వీట్ చేశారు. ఫాబిప్లూ కోవిడ్ పేషెంట్ల కోసం విరివిగా వాడుతున్న సంగతి తెలిసిందే.

రెమ్ డెసివర్ ఇంజక్షన్లలాగే వీటికి కూడా కొరత ఏర్పడుతోంది. అయితే..గంభీర్ దగ్గర అన్ని ఫాబిప్లూ ఎలా వచ్చాయని పార్టీలు ప్రశ్నలు గుప్పిస్తున్నాయి. నీ దగ్గర అంత ఫాబిప్లూ ఎలా ఉంది ? ఎలా వచ్చింది..ఇలా పెట్టుకోవడం నేరం కాదా ? అని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ట్వీట్ చేశారు. గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు ఇంజెక్షన్లను దాచి పెడుతారు..మహారాష్ట్ర మాజీ సీఎం రెమ్ డెసివర్ ను ఇంట్లో పెట్టుకుంటారు..ఇప్పుడు బీేపీ పార్టీ టైమ్ ఎంపీ ప్రాణాధారమైన ఈ మందులను దాచి పెట్టుకున్నారు..వీళ్లు ప్రజాప్రతినిధులేనా ? క్రమినల్సా ? అంటూ ఆప్ నేత దుర్గేష్ పాఠక్ ట్వీట్ చేశారు. వీటికి గంభీర్ స్పంించారు. రెమ్ డెసివర్ ను బ్లాక్ మార్కెట్ లో రూ. 30 వేలకు అమ్ముకోవడానికి అనుమతినిచ్చినప్పుడు, ఢిల్లీ ఆసుపత్రి బెడ్ లను రూ. 5-10 లక్షలకు అమ్మినప్పుడు ఏమీ అనని వాళ్లు..కొన్ని వందల ఫాబిప్లూను ఫ్రీగా ఇస్తానంటే విమర్శిస్తారా అంటూ గంభీర్ ఘాటు రిప్లై ఇచ్చారు.

Read More : Pfizer : నకిలీ ఫైబర్ టీకాల జప్తు…80 మందికి బోగస్ టీకాలు