క్వారంటైన్ నుంచి తప్పించుకుని…17కి.మీ నడిచిన కరోనా పేషెంట్

  • Published By: venkaiahnaidu ,Published On : April 29, 2020 / 09:46 AM IST
క్వారంటైన్ నుంచి తప్పించుకుని…17కి.మీ నడిచిన కరోనా పేషెంట్

పూణేలోని బాలేవాడి ప్రాంతంలోని ఒక ఐసోలేషన్ ఫెసిలిటీ నుండి 70 ఏళ్ల COVID-19 రోగి పారిపోయాడు. యార్వాడాలోని తన ఇంటికి చేరుకోవడాని దాదాపు 17 కిలోమీటర్లు అతడు నడిచాడు. నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన క్వారంటైన్ ఫెసిలిటీలో రోగులకు ఆహారాన్ని అందించట్లేదని, క్లీన్ వాష్‌రూమ్‌ల వంటి కనీన మౌలిక సదుపాయాలు లేనందున తాను క్వారంటైన్ సౌకర్యం నుండి తప్పించుకున్నట్లు అతను తెలిపాడు.

మంగళవారం సాయంత్రం, ఇంటిబయట నిస్సహాయంగా కూర్చొని ఉన్న 70ఏళ్ల కరోనా పేషెంట్ ను పొరుగింటోళ్లు గుర్తించారు. పేషెంట్ కుటుంబ సభ్యులు కూడా కోవిడ్ -19 కు పాజిటివ్ పరీక్షించిన తరువాత వారిని కూడా క్వారంటైన్ సెంటర్ కు తరలించడంతో ఆయన ఇళ్లు లాక్ చేయబడింది. ఏప్రిల్ 25 న కరోనా పాజిటివ్ వచ్చిన వృద్ధుడు తన ఇంటికి వచ్చాడని తెలుసుకున్న స్థానికులు,ఇంటిబయట కూర్చొని ఉన్న ఆ వృద్ధ పేషెంట్ ను గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు.

ఈ విషయం యర్రవాడ ఏరియా కార్పొరేటర్ సిద్ధార్థ్ ధెండే వద్దకు చేరుకుంది. దీంతో ఆ వృద్ధ పేషెంట్ ను  ఐసోలేషన్ సదుపాయానికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ ను ఏర్పాటుచేశారు కార్పొరేటర్. COVID-19 పాజిటివ్ వచ్చిన వృద్ధుడి కుమారుడు అంబులెన్స్‌తో వచ్చి  తన తండ్రిని తిరిగి క్వారంటైన్ సెంటర్ కు వెళ్లేందుకు ఒప్పించాడు. వృద్ధుడు ఐసోలేషన్ సౌకర్యం నుండి ఇంటికి వెళ్లేటప్పుడు మరెవరితోనూ సంప్రదించలేదని అధికారులు తెలిపారు.

వృద్ధుడికి వెంటనే పునరావాసం కల్పించాలని నేను అధికారులకు సమాచారం ఇచ్చాను. అతను అదృశ్యమయ్యాడని పౌర అధికారులకు కూడా తెలియదని నేను తెలుసుకున్నాను. అతను అనుమానాస్పదమైన కరోనావైరస్ కేసుగా ఉన్నాడు. ఏప్రిల్ 24 న ఖరాడిలోని రక్షక్నగర్ నిర్బంధ కేంద్రానికి ఆయన పంపబడ్డాడు. మరుసటి రోజు, టెస్ట్ లలో అతనికి కరోనా పాజిటివ్ వచ్చింది. అతన్ని బాలేవాడిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ (NICMAR) సౌకర్యానికి మార్చారు అని కార్పొరేటర్ చెప్పారు. క్వారంటైన్ సెంటర్లలో ప్రాథమిక సదుపాయాలు లేకపోవడం గురించి ధేండే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పరిశీలించాలని ఉన్నత అధికారులను కోరారు.