Jharkhand : తండ్రికి కరోనా పాజిటివ్, రక్షించాలంటూ కూతురు వేడుకోలు..పట్టించుకోని డాక్టర్లు..చివరకు

తండ్రికి కరోనా పాజిటివ్. పరిస్థితి విషమంగా ఉంది. కాస్త చూడండి సార్ అంటూ డాక్టర్ల చుట్టూ తిరిగిందా పేషెంట్ కూతురు. తన తండ్రిని కాపాడండంటూ కనిపించిన వైద్యుడినల్లా ప్రాధేయపడింది. కానీ..

Jharkhand : తండ్రికి కరోనా పాజిటివ్, రక్షించాలంటూ కూతురు వేడుకోలు..పట్టించుకోని డాక్టర్లు..చివరకు

Jharkhand

COVID-19 Patient Dies : తండ్రికి కరోనా పాజిటివ్. పరిస్థితి విషమంగా ఉంది. కాస్త చూడండి సార్ అంటూ డాక్టర్ల చుట్టూ తిరిగిందా పేషెంట్ కూతురు. తన తండ్రిని కాపాడండంటూ కనిపించిన వైద్యుడినల్లా ప్రాధేయపడింది. కానీ.. ఒక్క డాక్టర్ కూడా అటు చూడలేదు. కనీసం ఆసుపత్రిలోకి తీసుకు రండి అని కూడా చెప్పలేదు. అలా గంటకు పైగా సమయం గడిచిపోయింది. చివరకు పరిస్థితి విషమించింది. ట్రీట్‌మెంట్ అందక ఆ పేషెంట్ పార్కింగ్ ప్లేస్‌లోనే మృతి చెందాడు. ఆ తర్వాత తీరిగ్గా వచ్చిన వైద్యులు… ఆ వ్యక్తి చనిపోయాడని తాపీగా చెప్పారు. దీంతో… కన్నతండ్రిని కోల్పోయిన ఆ మహిళ రోదనలతో ఆసుపత్రి మారుమోగింది.

ఈ ఘటన జార్ఖండ్ రాజధాని రాంచీలోని సదర్ అనే ఆసుపత్రిలో జరిగింది. ఈ ఘటన జరిగే సమయానికి జార్ఖండ్ ఆరోగ్య మంత్రి బన్నేస్ గుప్తా అదే ఆసుపత్రిలో కోవిడ్ రోగులకు అందుతున్న సదుపాయాలను పరిశీలిస్తున్నారు. దీంతో.. వైద్యులు, సిబ్బంది మొత్తం ఆయన వెంటే ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆ మహిళ అగ్గిమీద గుగ్గిలమైంది. మంత్రి మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. గంట సేపు ప్రాదేయపడినా ఎవరూ రాలేదని.. మంత్రి మాత్రం ఓట్ల రాజకీయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన తండ్రి మరణానికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ ఆమె పెట్టిన కన్నీళ్లు అందరినీ కలచివేసాయి.

Read More : Bajaj Chetak: మళ్ళీ బుకింగ్స్ ప్రారంభించిన బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్!