COVID-19 patients: హాస్పిటల్‌లో బెడ్ షేర్ చేసుకుంటోన్న కొవిడ్ పేషెంట్లు

కొవిడ్ పేషెంట్ల పరిస్థితి దుర్భరంగా మారింది. నాగ్‌పూర్‌లోని జీఎంసీ హాస్పిటల్ లో కొవిడ్ పేషెంట్లు బెడ్లు షేర్ చేసుకుంటూ ట్రీట్‌మెంట్..

COVID-19 patients: హాస్పిటల్‌లో బెడ్ షేర్ చేసుకుంటోన్న కొవిడ్ పేషెంట్లు

Covid 19 Patients

COVID-19 patients: కొవిడ్ పేషెంట్ల పరిస్థితి దుర్భరంగా మారింది. నాగ్‌పూర్‌లోని జీఎంసీ హాస్పిటల్ లో కొవిడ్ పేషెంట్లు బెడ్లు షేర్ చేసుకుంటూ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. దీనిపై మెడికల్ సూపరిండెంట్ డా.అవినాశ్ వీ గవాండె మాట్లాడుతూ… ‘పేషెంట్లు అంతా ఒక్కసారిగా వస్తున్నారు. అర్బన్, రూరల్ జిల్లాల నుంచే కాకుండా చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ల నుంచి కూడా వచ్చిపడుతున్నారు.

పేషెంట్లను వెయిట్ చేయిస్తూ ఉంచలేం. వారి ఆక్సిజన్ లెవల్ మీద ప్రభావం చూపిస్తుంది. రద్దీగా ఉన్నప్పుడు ఇది రొటీన్ విషయం కాదు. 15 నుంచి 30నిమిషాల వరకూ వెయిట్ చేయాల్సి ఉంటుంది. ముందుగా వారికి ఆక్ిసజన్ అందించి ఆ తర్వాత హాస్పిటల్ వార్డ్స్ కు తరలిస్తున్నాం. ఒక్కసారి 40పేషెంట్లు వస్తే వారిని వార్డులకు పంపించడం కష్టంగా ఉంటుంది. అందుకే వారికి ఆక్సిజన్ సపోర్ట్ అందించి.. ఆ తర్వాత తరలిస్తున్నాం.

ఆదివారానికి అత్యధికంగా ఒక్కరోజులో 62కొవిడ్ మృతులు సంభవించగా.. మొత్తం కేసులు 5వేల 327కు చేరినట్లు అధికారిక సమాచారం. జిల్లాలో 4వేల 110 తాజా ఇన్ఫెక్షన్లు ఉన్నాయి. 3వేల 497మంది డిశ్చార్జ్ అయ్యారు. జిల్లా వ్యాప్తంగా లక్షా 94వేల 908మంది రికవరీ అయ్యారు.