Mask ధరిస్తే..65 శాతం Safe

  • Published By: madhu ,Published On : July 15, 2020 / 07:55 AM IST
Mask ధరిస్తే..65 శాతం Safe

కరోనా అరికట్టడానికి తప్పనిసరిగా Mask ధరిస్తే..చాలా లాభ ముందని, 65 శాతం ప్రమాదం నుంచి బయటపడినట్లేనని తాజాగా అధ్యయనంలో తేలింది. కరోనా వైరస్ కట్టడిలో మాస్క్ లే కీలక పాత్ర పోషిస్తాయని డేవిస్ చిల్డ్రన్స్ హాస్పిటల్, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం డాక్టర్ డీన్ బ్లంబర్గ్ (రసాయన ఇంజనీరింగ్ ప్రోఫెసర్) వెల్లడిస్తున్నారు.

భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం కరోనా వైరస్ వ్యాపించకుండా అరికట్టవచ్చన్నంటున్నారు. మాస్క్ లు ధరించడం వల్ల జరుగుతున్న పరిణామాలపై అధ్యయనం చేశామని, ఇందులో చాలా విషయాలు తెలిసాయన్నారు. బంబ్లర్గ్, విలియం రిస్టెన్ పార్ట్ ఇటీవలే దీనికి సంబంధించిన వీడియో ద్వారా ప్రజలకు వివరించారు.

mask corona

mask corona

మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని, అలాగే భౌతిక దూరం పాటించాలని అత్యవసరమైతే బయటకు రావాలని సూచించారు.
ప్రధానంగా ఓ వ్యక్తి తమ్మినా, దగ్గినా బయటకు వచ్చే కణాలు ఇతరుల మీదకు ప్రవేశిస్తాయని, మాస్క్ లు ధరించడం వల్ల..వాటిని నిరోధించవచ్చన్నారు.

మాస్క్ ధరించని వారు…ఇతరులకు వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సమాజాంలో వీరు బాధ్యతారాహిత్యంగా ఉంటారన్నారు. స్వచ్చమైన గాలి కీలక పాత్ర పోషిస్తుందని, వైరస్ ను అరికడుతుందన్నారు. కొంతమంది బిగ్గరగా మాట్లడడం వల్ల అధిక సంఖ్యలో కణాలు బయటకు వస్తాయన్నారు. సామాజిక దూరం ద్వారా 90 శాతం వైరస్ ను అరికట్టవచ్చని, అలాగే మాస్క్ ధరిస్తే…65 శాతం తగ్గుతుందన్నారు.