కరోనా సెకండ్ వేవ్ : కేంద్ర హోంశాఖ కొత్త మార్గదర్శకాలు జారీ

కరోనా నియంత్రణ కోసం కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం(మార్చి-23,2021)కేంద్రహోంశాఖ సెక్రటరీ అజయ్ భల్లా అన్ని రాష్ట్రాల/కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు లేఖ రాశారు.

కరోనా సెకండ్ వేవ్ : కేంద్ర హోంశాఖ కొత్త మార్గదర్శకాలు జారీ

Covid 19

Covid-19 second wave కరోనా నియంత్రణ కోసం కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం(మార్చి-23,2021)కేంద్రహోంశాఖ సెక్రటరీ అజయ్ భల్లా అన్ని రాష్ట్రాల/కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు లేఖ రాశారు. పని ప్రదేశాలు మరియు పబ్లిక్ లో, ముఖ్యంగా రద్దీ ప్రదేశాలలో కోవిడ్-19 నిబంధనలు పాటించేలా ప్రోత్సహించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆ లేఖలో కేంద్రహోంశాఖ కోరింది. టెస్ట్-ట్రాక్-ట్రీట్ ప్రోటోకాల్‌ను అనుసరించడం చాలా ముఖ్యమని తెలిపారు.

రాష్ట్రాలకు కేంద్రహోంశాఖ కార్యదర్శి రాసిన లేఖలోని ముఖ్య అంశాలు

-టెస్ట్,ట్రాక్,ట్రీట్ నియంత్రణ చర్యలు అమలు
-అన్ని రాష్ట్రాల్లో ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలి.
-నిర్దేశించిన స్థాయికి 70శాతం లేదా అంతకంటే ఎక్కువ టెస్టులు చేయాలి
-ఫేస్ మాస్కులు,సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని
-ప్రొటోకాల్ ప్రకారం కరోనా సోకిన వారి పరిచయాలను ముందుగానే గుర్తించాలి
-కంటైన్మెంట్ జోన్లలో కోవిడ్ నిబంధనలు కఠినతరంగా అమలుచేయాలి.
-కంటైన్మెంట్ జోన్ల జాబితాను వెబ్ సైట్లలో తెలియజేయాలి
-అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కరోనా టీకాల వేగం పెంచాలి
-రాష్ట్రాలు వారి అంచనా ఆధారంగా స్థానికంగా ఆంక్షలను తీసుకురావచ్చు
-ఏప్రిల్-1నుంచి ఏప్రిల్-30వరకు నిబంధనలు అమలు