India : కరోనా ఉధృతం, అల్లాడుతున్న నాలుగు రాష్ట్రాలు

ఇండియాలో కరోనా మరింత ఉధృతం దాల్చింది. రోజుకో రికార్డుతో సెకండ్‌వేవ్‌ పీక్స్‌కు వెళ్తోంది. వరుసగా నాలుగో రోజు కూడా లక్ష కేసుల మార్క్‌ దాటడమే కాకుండా.. లక్ష 50 వేల కేసుల వైపు పరుగులు తీస్తోంది.

India : కరోనా ఉధృతం, అల్లాడుతున్న నాలుగు రాష్ట్రాలు

Covid 19

Covid-19 Crisis In India : ఇండియాలో కరోనా మరింత ఉధృతం దాల్చింది. రోజుకో రికార్డుతో సెకండ్‌వేవ్‌ పీక్స్‌కు వెళ్తోంది. వరుసగా నాలుగో రోజు కూడా లక్ష కేసుల మార్క్‌ దాటడమే కాకుండా.. లక్ష 50 వేల కేసుల వైపు పరుగులు తీస్తోంది. ఒక్కరోజులోనే దేశవ్యాప్తంగా లక్ష 45వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దేశంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక్కరోజులో ఇన్ని పాజిటివ్ కేసులు ఎప్పుడూ రికార్డు కాలేదు. కరోనాతో 24 గంటల్లో 770 మందికిపైగా చనిపోయారు.

అటు యాక్టివ్‌ కేసుల సంఖ్య కూడా రాకెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతోంది. దేశంలో ఇప్పటి వరకు నమోదుకాని యాక్టివ్‌ కేసులు ప్రస్తుతం ఇండియాలో ఉన్నాయి. యాక్టివ్‌ కేసుల సంఖ్య 10 లక్షలు 46 వేలు దాటేసింది. గతేడాది సెప్టెంబర్‌లో 10 లక్షల 26 వేల యాక్టివ్‌ కేసులుండగా.. ఇప్పుడు ఆ రికార్డును చెరిపేసింది సెకండ్‌వేవ్‌.

కరోనా ఉగ్రరూపానికి మహారాష్ట్రతో పాటు ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, ఢిల్లీ అల్లాడిపోతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో 11 వేలకు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అటు ఉత్తర్‌ ప్రదేశ్‌లో దాదాపు 10 వేల పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. మరోవైపు ఢిల్లీలో కరోనా కోరలు విప్పింది. ఈ ఏడాదిలోనే రికార్డుస్థాయిలో 8 వేలకు పైగా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. గతేడాది నవంబర్‌ 11 తర్వాత ఢిల్లీలో ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి.

 

Read More : కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకుని ఫోటోలతో బెదిరింపులు..