Surat : కరోనాను జయించారు..కానీ కంటి చూపు కోల్పోయారు

కరోనాను జయించిన ఆనందం నిలువలేదు. బాహ్య ప్రపంచాన్ని వారు ఇక చూడలేరు. ఎందుకంటే..వారు కంటిచూపును కోల్పోయారు.

Surat : కరోనాను జయించారు..కానీ కంటి చూపు కోల్పోయారు

Surath

Covid-19 Survivors : కరోనాను జయించిన ఆనందం నిలువలేదు. బాహ్య ప్రపంచాన్ని వారు ఇక చూడలేరు. ఎందుకంటే..వారు కంటిచూపును కోల్పోయారు. కరోనా వైరస్ కారణంగా..శరీరంలోని వివిధ అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని వివిధ అధ్యయనాలు వెల్లడించాయి. కరోనా వైరస్ కారణంగా ఎంతో మంది మృత్యువాత పడుతున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ సోకిన వ్యక్తి..ఇతర వ్యాధులకు కూడా గురవుతున్నారు.

అయితే..కరోనా నుంచి కోలుకున్న 8 మంది వ్యక్తులు కంటి చూపు కోల్పోయిన విషాద ఘటన గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో చోటు చేసుకుంది. వీరిని వైద్య నిపుణులు పరిశీలించారు. మ్మూకోర్మిసిస్ అనే బ్లాక్ ఫంగస్ కారణంగా..కంటి చూపును కోల్పోయారని వారు వెల్లడిస్తున్నారు. ఈ ఫంగస్ అత్యంత ప్రమాదకరమని, ప్రాణాలను సైతం హరించి వేస్తుందని హెచ్చరించారు.

కరోనా చికిత్సకు వాడే మందుల వల్ల..బ్లాక్ ఫంగస్ ఏర్పడుతుందని ఢిల్లీలోని సర్ గంగారం ఆసుపత్రి ఈఎన్‌టీ విభాగం హెడ్ డాక్టర్ అజయ్ స్వరూప్ వెల్లడించారు. కరోనా వైరస్ కారణంగా…భారతదేశంలో 40 మంది వరకు బ్లాక్ ఫంగస్ బారిన పడ్డారని నివేదికలు వెల్లడిస్తున్నట్లు సమాచారం.

Read More : COVID-19 : ప్రతొక్కరూ ఇంట్లోనే ఉండండి..రవీంద్ర జడేజా వీడియో సందేశం