Covid Third wave : మూడో ముప్పు ముంగిట మహారాష్ట్ర

మూడవ ముప్పు ముంగిట మహారాష్ట్ర ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా ఫస్ట్‌, సెకండ్‌వేవ్‌లలో దేశంలో ఎక్కువగా ప్రభావితమైన రాష్ట్రం మహారాష్ట్ర. ముఖ్యంగా ముంబైలో కరోనా కేసుల గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఈక్రమంలో థర్డ్ వేవ్ ప్రమాదం మహారాష్ట్రకు ఉందని హెచ్చరికలు వినిపిస్తున్న క్రమంలో అన్ లాక్ కరెక్ట్ కాదంటున్నారు నిపుణులు.

Covid Third wave : మూడో ముప్పు ముంగిట మహారాష్ట్ర

Covid 19 Third Wave In Maharashtra

Covid-19 third wave in maharashtra : మూడవ ముప్పు ముంగిట మహారాష్ట్ర ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా ఫస్ట్‌, సెకండ్‌వేవ్‌లలో దేశంలో ఎక్కువగా ప్రభావితమైన రాష్ట్రం మహారాష్ట్ర. ముఖ్యంగా ముంబైలో కరోనా హలో అని పిలిస్తే పొలో అని పలికేలా ఉన్నాయి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భారత్ లో థర్డ్ వేవ్ డేంజర్ ఉంటుందని నిపుణుల అంచనా ప్రకారం ఇటీవల లాక్ డౌన్ లను సడలిస్తూ అన్ లాక్ లు ప్రకటిస్తున్న క్రమంలో మరోసారి కరోనా విరుచుకుపడుతుందా? అనే భయాందోళనలు కొనసాగుతున్నాయి. సెకండ్ వేవ్ లో కేసులు తగ్గుతుండటంతో పలు రాష్ట్రాలు అన్ లాక్ ప్రకటిస్తున్నాయి. అలాగే లాక్ డౌన్ నుంచి పలు రాష్ట్రాలు మినహాయింపులు ప్రకటిస్తున్నాయి. మార్కెట్లు, షాపింగ్ మాల్స్ లో జనాల సందడి పెరిగింది. దీంతో థర్డ్ వేవ్ వస్తే ఇక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించటానికే భయపడేలా ఉంటుందని అంచానాలున్నాయి.

మహారాష్ట్రకు థర్డ్‌వేవ్‌ ముప్పు త్వరలోనే పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో 2-4 వారాల్లో కరోనా థర్డ్‌ వేవ్‌ రాష్ట్రంలో ప్రారంభం కావొచ్చని మహారాష్ట్ర కొవిడ్‌ టాస్క్‌ ఫోర్స్‌ రాష్ట్రప్రభుత్వాన్ని హెచ్చరించింది. సెకండ్‌ వేవ్‌ కంటే థర్డ్‌ వేవ్‌ తీవ్రత రెట్టింపు ఉంటుందని, రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు 8 లక్షలకు పెరిగే ప్రమాదముందని అంచనా వేసింది. యూకే తరహాలు థర్డ్ వేవ్ ప్రమాదం మహారాష్ట్రకు ఉంటుందని నిపుణులు అంచాన వేస్తున్నారు.ఎందుకంటే వాణిజ్య రాజధాని అయిన ముంబైలో జనాభా శాతం బాగా ఎక్కువ. ఈక్రమంలో ఇప్పుడు అన్ లాక్ కరెక్టు కాదని నిపుణులు సూచిస్తున్నారు. గురువారం సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే కొవిడ్‌పై సమీక్ష సందర్భంగా అధికారులు ఈ సూచనలు చేశారు. థర్డ్‌ వేవ్‌ ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉండకపోవచ్చని పేర్కొన్నారు. మొత్తం కేసుల్లో పిల్లలకు సంబంధించినవి 10 శాతం ఉండొచ్చని తెలిపారు.

ఫస్ల్ వేవ్ లో 19 లక్షల మందికి కరోనా సోకితే..అదే సెకండ్ వేవ్ లో ఉదృతి పెరిగి 40 లక్షల కేసలు నమోదయ్యాయి. అలాగే ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ లో మరణాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇప్పుడు థర్డ్ వేవ్ లో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందని భయాందోళనలో ఉన్నారు ప్రజలు. ఇటువంటి పరిస్థితుల్లో అన్ లాక్ కరెక్ట్ కాదంటున్నారు నిపుణులు. థర్డ్ వేవ్ వస్తుందనే అంచనాలతో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం చెబుతున్న క్రమంలో మరి థర్డ్ వేవ్ నుంచి అయినా మహారాష్ట్ర అప్రమత్తమయ్యేలా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోనుందో చూడాలి.