Corona Third Wave: ఆగస్టు చివరిలో కరోనా థర్డ్ వేవ్ రావొచ్చు.. కానీ, సెకండ్ వేవ్ తీవ్రత ఉండకపోవచ్చు!

ప్రపంచాన్ని కరోనావైరస్ మహమ్మారి వణికిస్తోంది. ఇప్పటికే మొదటి, రెండో వేవ్ లతో అతలాకుతలం చేసిన కరోనా.. మరోసారి విజృంభించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం దేశంలో సెకండ్‌ వేవ్‌ కొనసాగుతోంది.

Corona Third Wave: ఆగస్టు చివరిలో కరోనా థర్డ్ వేవ్ రావొచ్చు.. కానీ, సెకండ్ వేవ్ తీవ్రత ఉండకపోవచ్చు!

Covid 19 Third Wave Likely By August End

Covid-19 third wave likely by August-end : ప్రపంచాన్ని కరోనావైరస్ మహమ్మారి వణికిస్తోంది. ఇప్పటికే మొదటి, రెండో వేవ్ లతో అతలాకుతలం చేసిన కరోనా.. మరోసారి విజృంభించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం దేశంలో సెకండ్‌ వేవ్‌ కొనసాగుతోంది. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌, వ్యాక్సినేషన్‌, కఠినమైన ఆంక్షలతో కరోనా కంట్రోల్‌కి వచ్చింది. సెకండ్ వేవ్ తర్వాత ఆగస్టు చివరిలో దేశంలో కరోనా థర్డ్‌వేవ్‌ వచ్చే అవకాశాలున్నాయట.. భారత వైద్య పరిశోధన మండలి (ICMR‌) టాప్ డాక్టర్ (Samiran Panda) సమీరన్‌ పండా అభిప్రాయపడ్డారు. ఒకవేళ కరోనా థర్డ్ వేవ్ వచ్చినా.. సెకండ్ వేవ్ స్థాయిలో తీవ్రత ఉండకపోవచ్చునని అంటున్నారు.

కరోనా మూడో వేవ్ విషయంలో పండా నాలుగు అంశాలను ప్రస్తావించారు. నాలుగు కారణాల వల్ల థర్డ్ వేవ్ రావచ్చనని చెప్పారు. ప్రధానంగా చాలామందిలో రోగనిరోధక శక్తి బలహీనపడటం కూడా ఇందుకు కారణమని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత మొదటి, రెండో వేవ్ ఇమ్యూనిటీలను తట్టుకోనేలా మూడో వేవ్ వేరియంట్లు బలపడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కరోనా ఆంక్షలు ఎత్తివేయడం కూడా మూడో వేవ్ ముప్పు ఒక కారణమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. థర్డ్ వేవ్‌కు డెల్టా ప్లస్ వేరియంట్ కారణమా అంటే… డెల్టా వేరియంట్లు రెండూ (Delta Plus) దేశవ్యాప్తంగా వ్యాపించాయి.

ఈ రెండు వేరియంట్ల కారణంగా ఆరోగ్యవ్యవస్థపై తీవ్ర ప్రభావం ఉంటుందని అనుకోవడం లేదన్నారు. ముందుగానే స్పందించి కరోనా థర్డ్ వేవ్ వ్యాప్తిని కంట్రోల్ చేయడం సాధ్యమేనని అంటున్నారు. కరోనా నిబంధనల విషయంలో కఠినంగా ఉండాలని, లేదని నిర్లక్ష్యం వహిస్తే మరింత ప్రమాదం ఉండే అవకాశం లేకపోలేదని హెచ్చరించారు. కరోనా హెచ్చరికలను తేలిగ్గా తీసుకోవద్దని సూచించారు. కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గినప్పటికీ.. మాస్కులు, భౌతిక దూరం, ఎప్పటికప్పుడు చేతులు శానిటైజ్‌ చేసుకోవడం తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతం చేయడం ద్వారా హెర్డ్ ఇమ్యూనిటీని సాధించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.