COVID-19 UPDATE: దేశంలో ప్రస్తుతం 2,342 కరోనా యాక్టివ్ కేసులు

దేశంలో ప్రస్తుతం 2,342 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా 171 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పేర్కొంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.01 శాతం ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.8 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. కరోనా నుంచి కొత్తగా 148 మంది కోలుకున్నారని వివరించింది.

COVID-19 UPDATE: దేశంలో ప్రస్తుతం 2,342 కరోనా యాక్టివ్ కేసులు

CORONA

COVID-19 UPDATE: దేశంలో ప్రస్తుతం 2,342 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా 171 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పేర్కొంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.01 శాతం ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.8 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. కరోనా నుంచి కొత్తగా 148 మంది కోలుకున్నారని వివరించింది.

దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న కేసుల సంఖ్య మొత్తం కలిపి 4,41,47,322 ఉన్నాయని చెప్పింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.09 శాతం ఉన్నట్లు తెలిపింది. వారాంతపు పాజిటివిటీ రేటు 0.11 శాతం ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు దేశంలో 91.25 కోట్ల కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వివరించింది.

నిన్న దేశంలో 1,80,926 కరోనా పరీక్షలు చేసినట్లు తెలిపింది. దేశంలో ఇప్పటివరకు 220.15 కోట్ల వ్యాక్సిన్ డోసులు వినియోగించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. వాటిలో 95.14 కోట్ల రెండో డోసులు, 22.44 కోట్ల ప్రికాషన్ డోసులు ఉన్నాయని చెప్పింది. నిన్న దేశ వ్యాప్తంగా 44,397 డోసుల వ్యాక్సిన్లు వేసినట్లు తెలిపింది. కాగా, కొన్ని రోజులుగా ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది.

Kamareddy master plan TS HC : కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు