Covid-19 Update : భారత్‌లో కొత్తగా 8,318 కేసులు, 465 మరణాలు

దేశంలో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 8,318 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో 465 మంది కరోనాతో మృతి చెందారు.

Covid-19 Update : భారత్‌లో కొత్తగా 8,318 కేసులు, 465 మరణాలు

Covid 19 Update India Reports 8,318 New Cases, 465 Deaths In 24 Hours

Covid-19 Update : దేశంలో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 8,318 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో 465 మంది కరోనాతో మృతి చెందారు. శుక్రవారం 10 వేలకుపైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఆ కరోనా కేసులు ఎనిమిది వేలకు తగ్గాయి. నిన్నటికంటే 21 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. యాక్టివ్‌ కేసులు లక్షకు తగ్గినట్టు పేర్కొంది. కరోనా యాక్టివ్ కేసులు 1,07,019 నమోదయ్యాయి. 541 రోజుల్లో ఇదే అత్యల్పం కూడా. మొత్తం కరోనా కేసుల్లో 1 శాతం కంటే తక్కువగా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. మార్చి 2020 నుంచి కరోనా యాక్టివ్ కేసుల సంఖ్యను పరిశీలిస్తే.. ప్రస్తుతం 0.31 శాతంగా యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఇక కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 1,07,019కి చేరుకుంది. కరోనా చికిత్స అనంతరం దేశంలో 10,967 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,39,88,797కి చేరింది. కోవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య మొత్తంగా 4,67,933కి చేరింది. 121.06 కోట్ల మంది కొవిడ్ టీకా తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

రోజువారీ పాజిటివ్ రేటు 0.86గా నమోదైంది. గత 54 రోజుల్లో 2శాతానికి తక్కువగానే ఉంది. వారాంతపు పాజిటివ్ రేటు 0.88శాతంగా ఉంది.. గత 13 రోజుల్లో 1 శాతానికి కంటే తక్కువగా నమోదైంది. ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 98.34శాతంగా నమోదైంది. మార్చి 2020 నుంచి ఇదే అత్యధికం. అదే సమయంలో కరోనా సంబంధిత మరణాలు 465 చేరాయి. మొత్తంగా కరోనా మరణాల సంఖ్య 4,67,933కు చేరింది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా మొత్తంగా 121.06 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందించారు.

Read Also : Narendra Tomar : రైతులు ఇళ్లకు వెళ్లిపోవాలి..MSPపై కమిటీ ఏర్పాటు