కరోనా మందును అందజేసేది కొందరికి మాత్రమే.. కేంద్రం సన్నాహాలు

కరోనా మందును అందజేసేది కొందరికి మాత్రమే.. కేంద్రం సన్నాహాలు

COVID-19 వ్యాక్సిన్ డెవలప్‌మెంట్ ప్రోసెస్‌లో భాగంగా.. కేంద్రం వేగంగా పనిచేస్తుంది. ఈ వ్యాక్సిన్ ను రెడీ చేసి ప్రజలందరికీ అందించాలనే యోచనలో ఉన్నా ముందుగా ఎవరికి ఇవ్వాలని నానా తంటాలు పడుతుంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ దేశ జనాభాలో అందరికీ అందించేంత మొత్తంలో సిద్ధం చేయలేదు కాబట్టి.. తొలి డోస్ ను ఇవ్వడానికి లిస్ట్ రెడీ చేస్తుంది కేంద్రం.

ఈ క్రమంలో హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు, ఇంకొందరికీ కలిపి 30కోట్ల మందికి వైరస్ ఫస్ట్ డోస్ అందివ్వనున్నారు. దీని కింద దేశ జనాభాలో తొలి దశలో 23శాతం మందికి వ్యాక్సిన్ అందుతుంది. 30కోట్ల మంది బెనిఫిషియరీలకు 60కోట్ల వ్యాక్సిన్ డోసులు తొలి దశలో ఇస్తారు.



నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్.. నాలుగు కేటగిరీల కింద వీరిని లిస్ట్ చేస్తున్నారు. 70-75 హెల్త్ కేర్ ప్రొఫెసనల్స్, 26కోట్ల మంది 50 సంవత్సరాల వయస్సున్న వారు, 50ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న వారికి రెండు కోట్ల ఫ్రంట్ లైన్ వర్కర్లకు, పోలీసులకు, మునిసిపల్ వర్కర్లకు, ఆర్మీ బలగాలకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.

నీతి అయోగ్ సభ్యుడు డా.వీకే పాల్, హెల్త్ సెక్రటరీ రాజేశ్ భూషన్ అధ్యక్షతన తొలి దశ వ్యాక్సిన్ల ప్రపోజల్ ను యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అండ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO) స్టడీ చేసింది.

డ్రాఫ్ట్ ప్లాన్ లో భాగంగా పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్ నుంచి 70లక్షల హెల్త్ కేర్ వర్క్ ఫోర్స్ కొవిడ్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటారు. ఇందులో 11లక్షల మంది ఎంబీబీఎస్ డాక్టర్లు, 8లక్షల మంది ఆయుష్ ప్రాక్టీషనర్లు, 15లక్షల నర్సులు, 7లక్షల ఆక్సిలరీ నర్సులులు, 10లక్షల మంది ఆశా వర్కర్లు, 7నుంచి 8లక్షల మంది శానిటేషన్ వర్కర్లు, అంబులెన్స్ డ్రైవర్లు, హాస్పిటల్ సెక్యూరిటీలు ఉన్నారు.

అక్టోబరు చివరి నాటికి గానీ, నవంబరులో గానీ ఈ ఫైనల్ లిస్ట్ రెడీ అవనుంది. పలు సందర్భాల్లో డా.హర్ష వర్థన్ కొవిడ్ వ్యాక్సిన్ మార్చి 2021నాటికి అమల్లోకి వస్తుందని చెప్పారు. గత నెలలో జరిగిన ఓ ఇంటరాక్షన్ లో సోషల్ మీడియా ఫాలోవర్లు, వర్ధన్ కచ్చితమైన రోజు చెప్పలేమని అన్నారు. దీనిని బట్టి చూస్తే సంవత్సరారంభంలోనే వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ డా.సురేశ్ జాదవ్ తమ ఇన్‌స్టిట్యూట్ 60నుంచి 70మిలియన్ డోసుల కొవిడ్ వ్యాక్సిన్ ను జనవరి 2021నాటికి అందజేస్తుందని చెప్తున్నారు.