COVID-19 vaccine డ్రైన్ రన్, ఏపీతో పాటు మరో మూడు రాష్ట్రాల్లో

COVID-19 vaccine డ్రైన్ రన్, ఏపీతో పాటు మరో మూడు రాష్ట్రాల్లో

COVID-19 vaccine Dry run : కరోనా వాక్సినేషన్‌పై కేంద్రం ఫోకస్ పెట్టింది. మరో వారం రోజుల్లో ఏపీతో పాటు మరో మూడు రాష్ట్రాల్లో కోవిడ్ వాక్సినేషన్ (COVID-19 vaccine) డ్రై రన్చే (Dry run) చేపట్టనున్నారు. భౌగోళిక పరిస్థితుల ఆధారంగా మొదట పంజాబ్, ఏపీ, అసోం, గుజరాత్ రాష్ట్రాల్లో డ్రై రన్ నిర్వహించనున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఈ నాలుగు రాష్ట్రాల్లోని ఏవైనా రెండు జిల్లాల్లో ఐదేసి ప్రాంతాలను ఎంపిక చేసి కరోనా వాక్సినేషన్ డ్రై రన్ నిర్వహిస్తారు. ఒక్క జిల్లాలో ఐదు ప్రాంతాల చొప్పున.. మొత్తం 50 ప్రాంతాల్లో డ్రై రన్ చేపట్టనున్నారు. ఇప్పటికే సంబంధిత జిల్లా యంత్రాంగాలకు కేంద్రం నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. డిసెంబరు 28, 29 తేదీల్లో డ్రైన్ రన్ నిర్వహించేందుకు పంజాబ్‌లోని సంబంధిత జిల్లా అధికారులు ఏర్పాట్లు కూడా మొదలు పెట్టారు.

భారత్ (India)‌లో ప్రస్తుతం కరోనా వాక్సిన్‌ ట్రయల్స్ (Corona vaccine trials)‌ ఆఖరి దశలో ఉన్నాయి. కేంద్రం ఆమోద ముద్ర వేసిన వెంటనే వాక్సిన్ అందుబాటులోకి వస్తుంది. అంతకంటే ముందే వాక్సినేషన్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వాక్సిన్ భద్రపరిచే కోల్డ్ స్టోరేజీలు, రవాణా సదుపాయం, వాక్సినేషన్ సెంటర్ల ఏర్పాట్లు, వాక్సిన్ ఇచ్చే సిబ్బందిని నియమించడం లాంటి కార్యక్రమాలు చేపడతారు. ఒక్క వాక్సినేషన్‌ మినహా మిగతా అంతా సిద్ధం చేస్తారు. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే.. నేరుగా వాక్సినేషన్ ప్రారంభిస్తారు. అలా జరగాలంటే ముందు అంతా సిద్ధం చేసుకోవాలి. దాన్నే డ్రై రన్‌గా పిలుస్తారు.

వాక్సిన్ డెలివరీ ప్రాసెస్ కోసం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య మల్టీ లెవెల్ గవర్నెన్స్ మెకానిజంను కేంద్రం ఏర్పాటు చేసింది. ఇందులో మూడు రకాల కమిటీలు ఉన్నాయి. రెండు రాష్ట్ర స్థాయిలో, ఒకటి జిల్లా స్థాయిలో పనిచేస్తాయి. ఈ కమిటీలన్నీ నిత్యం సమావేశమై క్షేత్రస్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియను సమీస్తాయి. వాక్సినేషన్‌లో మెడికల్ అధికారులు, వాక్సినేటర్లు, ఆల్టర్‌నేట్ వాక్సినేటర్లు, కోల్డ్ చైన్ హ్యాండ్లర్స్, సూపర్‌వైజర్స్, డేటా మేనేజర్స్, ఆశా కోఆర్డినేటర్లు తమ విధులు నిర్వహిస్తారు.

కరోనా వాక్సిన్ నిల్వ, డెలివరీ కోసం.. దేశవ్యాప్తంగా 29వేల కోల్డ్ చైన్ పాయింట్లు, 240 వాక్సిన్ కూలర్స్, 70 వాక్సిన్ ఫ్రీజర్స్, 45వేల ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్లు, 41వేల డీప్ ఫ్రీజర్స్, 300 సోలార్ రిఫ్రిజిరేటర్స్ అందుబాటులోకి తెస్తున్నారు. సంబంధిత రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా ఇప్పటికే ఈ సామాగ్రిని తరలించారు. వాక్సినేషన్‌కు అవసరమైన సామాగ్రి చేరుకోవడంతో మిగతా ఏర్పాట్లపై దృష్టిపెట్టారు. ఇవన్నీ చూస్తుంటే మరో వారం రోజుల్లో డ్రై రన్‌తో పాటు వచ్చే ఏడాది ప్రారంభంలోనే కరోనా వాక్సిన్ అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.