Covid 19 Vaccine : దేశంలో వ్యాక్సినేషన్ స్పీడప్

దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఊపందుకుంది. టీకా ప్రక్రియ ద్వారానే కరోనాకు ముకుతాడు వేయొచ్చని అభిప్రాయపడ్డ కేంద్రం... వ్యాక్సినేషన్‌లో వేగం పెంచింది. నెల నెలకు వ్యాక్సిన్ డోసులను పెంచుతున్నారు. ఈ నెలలో ఇప్పటికే 30 లక్షల డోసులు వేశారు. ఏప్రిల్, మే నెలలతో పోల్చితే... జూన్‌లో టీకా డోసులను రెట్టింపు సంఖ్యలో పెంచారు. ఇప్పుడు అందిస్తున్న డోసులకు మరో మూడు రెట్లు పెంచి టీకాలు వేస్తేనే లక్ష్యాన్ని చేరుకుంటామని అధికారులు చెబుతున్నారు.

Covid 19 Vaccine : దేశంలో వ్యాక్సినేషన్ స్పీడప్

India Covid 19

Covid 19 Vaccine India : దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఊపందుకుంది. టీకా ప్రక్రియ ద్వారానే కరోనాకు ముకుతాడు వేయొచ్చని అభిప్రాయపడ్డ కేంద్రం… వ్యాక్సినేషన్‌లో వేగం పెంచింది. నెల నెలకు వ్యాక్సిన్ డోసులను పెంచుతున్నారు. ఈ నెలలో ఇప్పటికే 30 లక్షల డోసులు వేశారు. ఏప్రిల్, మే నెలలతో పోల్చితే… జూన్‌లో టీకా డోసులను రెట్టింపు సంఖ్యలో పెంచారు. ఇప్పుడు అందిస్తున్న డోసులకు మరో మూడు రెట్లు పెంచి టీకాలు వేస్తేనే లక్ష్యాన్ని చేరుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఇలా చేస్తే దేశంలో సెప్టెంబర్‌ నాటికి 80 శాతం మంది జనాభాకు టీకా వేయొచ్చు. జూన్ 21 నుంచి వ్యాక్సినేషన్‌ సరఫరా మరింత వేగం కానుందని… దీంతో జులై నాటికి వంద కోట్ల డోసులు అందుబాటులో ఉంటాయని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోంది.

జనవరిలో 37 లక్షల 50 వేల మందికి టీకాలు అందించారు. ఫిబ్రవరిలో కోటిన్నర మందికి, మార్చిలో దాదాపు ఆరు కోట్లు, ఏప్రిల్‌లో 9 కోట్లు, మే నెలలో 6 కోట్ల మందికి వ్యాక్సిన్ వేశారు. ఈ నెలలో కేవలం 12 రోజుల్లోనే మూడున్నర కోట్ల మందికి టీకా అందించారు. దేశంలో వ్యాక్సిన్ వేసుకున్న వారిలో మహిళల కంటే పురుషులే ఎక్కువ మంది ఉన్నారు. 54 శాతం పురుషులు, 46 శాతం మంది మహిళలు టీకాలు తీసుకున్నారు. దేశంలో అత్యధికంగా 88 శాతం మంది కోవిషీల్డ్ తీసుకున్నారు.

కేవలం 12 శాతం మంది మాత్రమే కోవాగ్జిన్ వేసుకున్నారు. మొదటి డోసు కోవాగ్జిన్ తీసుకున్న వారు.. చాలా మంది సెకండ్ డోసు కోసం ఎదురుచూస్తున్నారు. కొన్ని కారణాల వల్ల కోవాగ్జిన్ సరఫరాలో జాప్యం నెలకొంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఇదో సమస్యగా మారింది. పట్టణ ప్రాంతాల్లో ప్రైవేట్ వ్యాక్సినేషన్‌ ప్రముఖ పాత్ర వహిస్తోంది. త్వరలో వ్యాక్సిన్ల సరఫరా మరింత పెరిగే అవకాశం ఉండంటంతో.. ప్రైవేట్ టీకా ప్రక్రియ కూడా ఊపందుకోనుంది.

Read More : Mumbai City: కాంట్రాక్టర్ పై చెత్త వేయించిన ఎమ్మెల్యే