Covid Vaccine: కొవిడ్ వ్యాక్సిన్ వద్దంటూ నదిలో దూకిన 200మంది

కొవిడ్-19 లాంటి మహమ్మారిని జయించడానికి ఉన్న ఏకైక ఆయుధం వ్యాక్సిన్. కొన్ని రాష్ట్రాల్లో కొరత కారణంగా వ్యాక్సిన్ కోసం చూస్తున్న వారికి ఎదురుచూపులే మిగులుతున్నాయి.

Covid Vaccine: కొవిడ్ వ్యాక్సిన్ వద్దంటూ నదిలో దూకిన 200మంది

Covid Vacine Fear

Covid Vaccine: కొవిడ్-19 లాంటి మహమ్మారిని జయించడానికి ఉన్న ఏకైక ఆయుధం వ్యాక్సిన్. కొన్ని రాష్ట్రాల్లో కొరత కారణంగా వ్యాక్సిన్ కోసం చూస్తున్న వారికి ఎదురుచూపులే మిగులుతున్నాయి. మరోవైపు అస్సలు వ్యాక్సిన్ మాకొద్దు బాబోయ్.. అనే వాళ్లు కూడా ఇంకా ఉన్నారట.

ప్రాణాంతకమైన వైరస్ ను చంపే వ్యాక్సిన్ ఇంకెంత విషపూరితమైందోనని భయపడుతున్న గ్రామస్థులు యూపీకి చెందిన బరబంకీ జిల్లాలోని సిసౌందా జిల్లాలో ఉన్నారు. హెల్త్ వర్కర్లు వ్యాక్సిన్ వేయడానికి వస్తుంటే తప్పించుకోవడానికి సరయు నదిలోకి దూకేస్తున్నారు.

శనివారం హెల్త్ వర్కర్ల టీం వ్యాక్సిన్ వేయడానికి వచ్చింది. ఆ షాక్ కు గ్రామస్థులు వారిని చూసి పరుగులు పెట్టారు. నదీవైపుకు పరిగెత్తి అందులో దూకేశారు. అదేదో విషంలా భావించి భయపడుతున్నట్లు ప్రవర్తించారు.

200మంది గ్రామస్థులు నదిలోకి దూకేసినట్లు తెలిసింది. వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేటర్లంతా గ్రామాన్ని వదిలేసి వెళ్లిపోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. గ్రామస్థులంతా మునిగిపోతారని భావించి హెల్త్ వర్కర్లు వెనక్కువెళ్లిపోయారు.

రామ్ నగర్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ రాజీవ్ కుమార్ శుక్లా.. గ్రామస్థులకు అవగాహన కల్పించానని.. వ్యాక్సిన్ ప్రాముఖ్యతను తెలియజెప్పానని 18మంది వ్యాక్సిన్ వేయించుకున్నట్లు వెల్లడించారు. ఆ గ్రామ జనాభా మొత్తం 1700 మంది.