కరోనా వ్యాక్సిన్ ఏడాదే పని చేస్తుందా ? ప్రతి సంవత్సరం తీసుకోవాల్సిందేనా ?

  • Published By: madhu ,Published On : August 11, 2020 / 09:43 AM IST
కరోనా వ్యాక్సిన్ ఏడాదే పని చేస్తుందా ? ప్రతి సంవత్సరం తీసుకోవాల్సిందేనా ?

కరోనా వైరస్ వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కొత్త కొత్త అంశాలు తెరపైకి వస్తుండడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే..ఒక్కసారి వ్యాక్సిన్ తీసుకుంటే..జీవితకాలం అవసరం లేదా అనే కొత్త చర్చ తెరపైకి వచ్చింది. దీనిపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.



దీని శక్తి ఏడాది మాత్రమే ఉంటుందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ విషయంలో ఈ అభిప్రాయం మారిపోయింది. వైరస్ వేగంగా రూపాంతరం చెందే లక్షణం ఉండడమే కారణమంటున్నారు. ఈ వ్యాక్సిన్ ఓసారి తీసుకుంటే…ఇక జీవితాంతం అవసరం లేదని అనుకున్నారు.

అయితే..ఫ్లూ మార్పులు చెందుతుండడంతో ప్రతి సంవత్సరం శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ ను అందుకు తగ్గట్టుగా మార్పులు చేస్తున్నారు. దీనివల్ల ప్రత సంవత్సరం వ్యాక్సిన్ వేసుకోవాల్సిందేనంటున్నారు. ఈ క్రమంలో…కోవిడ్ కు అందుబాటులోకి వచ్చే వ్యాక్సన్ కూడా ఇలా తరచూ..వేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.



చైనా నుంచి వచ్చిన ఈ వ్యాక్సిన్ వివిధ దేశాల్లో ఒక్కో రకంగా విస్తరిస్తోంది. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినా.. వైరస్‌ మారితే అది పనిచేసే అవకాశం ఉండదు. అప్పుడు వ్యాక్సిన్‌లో మార్పులు అవసరమవుతాయంటున్నారు.