51 లక్షల మందికి Covid-19 vaccine – కేజ్రీవాల్

51 లక్షల మందికి Covid-19 vaccine – కేజ్రీవాల్

Covid-19 vaccine Delhi: కరోనా వ్యాక్సిన్ (Covid-19 vaccine) కోసం భారత దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. మొదటి దశలో 51 లక్షల మందికి కోవిడ్ – 19 వ్యాక్సిన్ ఇవ్వనున్నామని సీఎం కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రకటించారు. కేంద ప్రభుత్వం రూపొందించిన ప్రాధాన్యత కేటగిరి ప్రకారం (priority category) టీకాలు వేసే మొదటి వారిని గుర్తించడం జరిగిందన్నారు. 2020, డిసెంబర్ 24వ తేదీ గురువారం ఆయన వ్యాక్సిన్ పంపిణీ, తదితర వాటిపై వైద్య, ఆరోగ్య శాఖాధికారులు, ఇతర అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.

అనంతరం సీఎం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. 74 లక్షల కొవిడ్ – 19 వ్యాక్సిన్ నిల్వ సామర్థ్యాన్ని ఉంచేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని, నిల్వ సామర్థ్యాన్ని ఒక వారంలో 1.15 కోట్ల మోతాదుకు పెంచుతామన్నారు. టీకా వేసే వారికి..ప్రదేశం, సమయం, తేదీ, తదితర వివరాలు..వారి యొక్క మొబైల్ నెంబర్‌కు SMS పంపబడుతుందన్నారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీ (Delhi)లో పరిస్థితి మెరుగుపడుతోందని, పాజిటివ్ రేటు ఇప్పుడు 1శాతం కన్నా తక్కువకు వచ్చిందని వెల్లడించారు. ప్రతొక్కరూ టీకా కోసం ఎదురు చూస్తున్నట్లు, ఇందుకు తమ ప్రభుత్వం (Delhi government) అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు.

కేంద్రం ప్రభుత్వం నుంచి వ్యాక్సిన్ తీసుకొనేందుకు సిద్ధంగా ఉన్నామని, నిల్వ చేయడానికి…గుర్తించిన ప్రజలకు అందించేందుకు రెడీగా ఉన్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యత ప్రకారం..మూడు భాగాలుగా విభజించబడిందని తెలిపారు. ఆరోగ్య సంరక్షణ కార్మికులు, ఫ్రంట్ లైన్ కార్మికులు, వృద్ధులున్నారని వివరించారు. హెల్త్ వర్కర్స్, వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది..వ్యాక్సిన్ తీసుకొనేది మొదటి వారని, ఇక్కడ మూడు లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలను ఇప్పటికే గుర్తించామన్నారు. తర్వాత..పోలీసులు, పౌర రక్షణ వాలంటీర్లు, మున్సిపల్ కార్మికులు ఫ్రంట్ లైన్ విభాగంలోకి వస్తారన్నారు.

ఇలాంటి వారు 6 లక్షల మంది ఉన్నారని, మూడో వర్గంలో 50 సంవత్సరాలు, 50 సంవత్సరాల తక్కువ వయస్సుండి..అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్న వారు వస్తారన్నారు. ఇందులో 42 లక్షల మంది ఉన్నారని చెప్పారు. ప్రతి వ్యక్తికి రెండు మోతాదుల వ్యాక్సిన్ ఇస్తామని, ప్రస్తుతం 1.02 కోట్లుగా అంచనా వేశామన్నారు. టీకాలు వేసేందుకు తగిన కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, సైడ్ ఎఫెక్ట్స్ కలిగితే..వారికి చికిత్స చేయడానికి నిపుణుల బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు సీఎం కేజ్రీవాల్.

మరోవైపు..కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతున్న క్రమంలో..సెకండ్ వేవ్ పేరిట మరో మహమ్మారి కలవర పెడుతోంది. బ్రిటన్‌లో బయపడిన ఈ వైరస్ వేగంగా విస్తరిస్తోందని అంచనా వేస్తున్నారు. భారతదేశంలో కూడా విస్తరించే ప్రమాదం ఉండడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. బ్రిటన్, యూరప్ దేశాల నుంచి వచ్చే విమాన రాకపోకలపై నియంత్రిస్తోంది.