వాల్మార్ట్, ఫ్లిప్‌కార్ట్ విరాళం రూ .46కోట్లు.. రైతుల కోసం కూడా!

  • Published By: vamsi ,Published On : April 18, 2020 / 12:18 PM IST
వాల్మార్ట్, ఫ్లిప్‌కార్ట్ విరాళం రూ .46కోట్లు.. రైతుల కోసం కూడా!

వాల్మార్ట్ ఇంక్, వాల్మార్ట్ ఫౌండేషన్, ఫ్లిప్‌కార్ట్‌ సంస్థలు ఆరోగ్య సంరక్షణ కార్మికుల కోసం వ్యక్తిగత రక్షణ పరికరాలను (పీపీఈ), రైతులకు మరియు చిన్న వ్యాపారాలకు అవసరమైన సహాయక సామగ్రిని అందించే సంస్థలకు నిధులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాయి. కోవిడ్ -19పై భారత్ పోరాటానికి మద్ధతుగా ఈ మేరకు సహాయం చెయ్యడానికి నిర్ణయం తీసుకున్నాయి. 

ఇందుకోసం భారతదేశంలో 38.3 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్లు సదరు కంపెనీలు ప్రకటించాయి. ప్రభుత్వేతర సంస్థలు (ఎన్జిఓలు) పబ్లిక్ హెల్త్ కేర్ కార్మికులకు పంపిణీ చేయడానికి ఎన్95 మాస్క్‌లు మరియు మెడికల్ గౌన్లు, పీపీఈలను అందించడంపై కంపెనీలు దృష్టి సారించాయి.

దీనికి అదనంగా సుమారు 8 కోట్ల రూపాయలను రైతలకు సేవ చేసే స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వనున్నట్లు వెల్లడించాయి. ఇప్పటికే 3లక్షల మాస్క్‌లు, పది లక్షలమెడికల్ గౌన్లను అందించిన సంస్థ బలహీన వర్గాలకు మద్దతు ఇస్తున్న గూంజ్, శ్రీజన్ అనే స్వచ్ఛంద సంస్థకు 7.7 కోట్లను అదనంగా ఇస్తోంది. 

ఈ నిధులను రైతులు, గ్రామీణ చిన్న వ్యాపారులకు అవసరమైన నిధులుగా ఉపయోగించాలని సంస్థలు కోరుతున్నాయి.