COVID-19: దేశంలో ‘R-0’ విలువ ప్రకారం ఫిబ్రవరిలో గరిష్ట స్థాయికి కరోనా మూడో వేవ్

ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య కోవిడ్-19 మూడో వేవ్ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని ఐఐటీ మద్రాస్ ప్రాథమిక విశ్లేషణ అంచనా వేసింది.

COVID-19: దేశంలో ‘R-0’ విలువ ప్రకారం ఫిబ్రవరిలో  గరిష్ట స్థాయికి కరోనా మూడో వేవ్

Corona 11zon 1 7

COVID-19: ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య కోవిడ్-19 మూడో వేవ్ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని ఐఐటీ మద్రాస్ ప్రాథమిక విశ్లేషణ అంచనా వేసింది. విశ్లేషణ ప్రకారం.. వైరస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో సూచించే భారతదేశపు R-0 విలువ ఈ వారం నాలుగు వద్ద నమోదైంది. దీని ప్రకారం.. కరోనా వ్యాప్తి రేటు చాలా ఎక్కువగా ఉందని చెబుతున్నారు నిపుణులు.

మద్రాస్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT) ప్రాథమిక విశ్లేషణ ప్రకారం, ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య మూడవ వేవ్ గరిష్ట స్థాయికి చేరుకుని ప్రతీరోజూ లక్షల్లో కేసులు నమోదవుతాయని చెబుతున్నారు. ‘R-zero’ (or) ‘R0’ విలువ అనేది ఒక కరోనా సోకిన వ్యక్తి నుంచి ఎంతమందికి ఇన్‌ఫెక్షన్‌ వ్యాపిస్తుందో చూపుతుంది. ఈ విలువ ఒకటి కంటే తక్కువగా ఉంటే, కరోనా మహమ్మారి ముగిసినట్లుగా పరిగణించవచ్చు.

‘R0’ మూడు విషయాలపై ఆధారపడి ఉంటుంది..

గతవారం(డిసెంబర్ 25 నుండి డిసెంబర్ 31 వరకు), IIT మద్రాస్ ప్రాథమిక విశ్లేషణ ఆధారంగా జాతీయ స్థాయిలో R విలువ 2.9కి దగ్గరగా ఉంది. ఈ వారం(జనవరి 1 నుండి 6 వరకు) ఈ సంఖ్య నాలుగుగా నమోదైంది. IIT మద్రాస్ గణిత విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జయంత్ ఝా మాట్లాడుతూ, R0 అనేది వ్యాప్తి చెందే ప్రమాదం, సంక్రమణ రేటు, సమయ వ్యవధి అనే మూడు విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఐసోలేషన్, కంటాక్ట్ రేటు తగ్గవచ్చు కానీ, ఆ సందర్భంలో R0 తగ్గవచ్చు.

ఫిబ్రవరి 15లోపే గరిష్ట స్థాయికి..
ఝా తన అంచనా ప్రకారం, ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 15 మధ్య కరోనావైరస్ గరిష్టంగా ఉంటుందని, మునుపటి రెండు వేవ్‌ల కంటే వేగంగా ఈసారి కరోనా వ్యాపిస్తుందని భావిస్తున్నారు. గతంలో వచ్చిన వేవ్‌లకు భిన్నంగా ఈ వేవ్ ఉంటుందని అంటున్నారు. వ్యాక్సిన్‌లు వేయించుకోవడం వల్ల చనిపోయేవారి ప్రమాదం మాత్రం తగ్గుతుందని, కానీ ఈసారి సామాజిక దూరం, మాస్క్‌లు ధరించడం వంటి విషయాల్లో అశ్రద్ధ ఎక్కువగా కనిపిస్తుందని, అందువల్లే కరోనా వేగంగా వ్యాపిస్తుందని అభిప్రాయపడ్డారు.

Indian Coast Guard : పది మందితో భారత జలాల్లోకి ప్రవేశించిన పాక్ పడవ.. పట్టుకున్న అధికారులు