దీపావళి నాటికి Covid-19 పూర్తిగా అదుపులోకి వస్తుంది – హర్ష్ వర్ధన్

దీపావళి నాటికి Covid-19 పూర్తిగా అదుపులోకి వస్తుంది – హర్ష్ వర్ధన్

కేంద్ర మంత్రి డా. హర్ష్ వర్ధన్ కొవిడ్-19 దీపావళి నాటికి పూర్తిగా అదుపులోకి వస్తుందని అంటున్నారు. అనత్‌కుమార్ ఫౌండేషన్ నిర్వహించిన నేషన్ ఫస్ట్ వెబినార్ సిరీస్ ఆరంభోత్సవానికి హాజరైన హర్ష్‌వర్ధన్.. కరోనా మహమ్మారి గురించి తీసుకుంటున్న చర్యలు గురించి మాట్లాడారు.



‘కొవిడ్-19 ఈ సంవత్సరం దీపావళి నాటికి అదుపులోకి వచ్చేస్తుంది. మహమ్మారిపై లీడర్లు, సాధారణ ప్రజలు సమష్ఠిగా కష్టపడుతున్నారు. ఈ వైరస్ మనకు ఓ పాఠం నేర్పింది. మన జీవన విధానం గురించి మనం జాగ్రత్తగా నడుచుకోవాల్సి ఉంది అని హర్ష వర్ధన్ చెప్పారు. ఈ సంవత్సరం చివరికల్లా.. కొవిడ్-19కు వ్యాక్సిన్ వచ్చేస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.
https://10tv.in/cdc-defends-controversial-new-guidance-for-coronavirus-testing/
ఇండియాలో కరోనా వైరస్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. 7-8 కంపెనీలు వ్యాక్సిన్ కోసం పనిచేస్తున్నారు. అందులో మూడు కంపెనీల్లో క్లినికల్ ట్రయల్ ఫేజ్ లు పూర్తయ్యాయి. కొవిడ్ కు వ్యాక్సిన్ దాదాపు రెడీ అయిపోతుందని చెప్పారు.



ఫిబ్రవరిలో మనకు ఉంది ఒకే ఒక్క ల్యాబ్. ఇప్పుడు అవి దేశవ్యాప్తంగా వెయ్యి 583 అయ్యాయి. వీటిల్లో 1000 ప్రభుత్వ ల్యాబ్ లే. దేశమంతటా రోజుకు మిలియన్ టెస్టులు జరుగుతున్నాయి. ఇప్పుడు పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు, N95మాస్క్ ల గురించి కూడా భయపడనవసరం లేదు.