India corona: మళ్లీ పెరిగిన కొవిడ్ కేసులు.. నిన్నటికంటే 24శాతం అధికం

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్నా కొవిడ్ ఆనవాళ్లను తుడిచిపెట్టలేక పోతున్నారు. ప్రస్తుతం మూడువేల దిగువకు రోజువారి కేసులు నమోదవుతున్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్ తీవ్రత ఎక్కువగానే కనిపిస్తోంది...

India corona: మళ్లీ పెరిగిన కొవిడ్ కేసులు.. నిన్నటికంటే 24శాతం అధికం

Covid 19

India corona: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్నా కొవిడ్ ఆనవాళ్లను తుడిచిపెట్టలేక పోతున్నారు. ప్రస్తుతం మూడువేల దిగువకు రోజువారి కేసులు నమోదవుతున్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్ తీవ్రత ఎక్కువగానే కనిపిస్తోంది. కొవిడ్ నివారణకు దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుంది. ఇప్పటి వరకు 192 కోట్లకుపైగా డోసులు పంపిణీ అయ్యాయి. బుధవారం ఒక్కరోజు 13.13లక్షల మంది టీకా వేయించుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Covid-19 Cases : దేశంలో కొత్తగా 2,124 కరోనా కేసులు, 17 మరణాలు

బుధవారం దేశవ్యాప్తంగా 4.52 లక్షల మందికి కొవిడ్ పరీక్షలను వైద్య సిబ్బంది నిర్వహించారు. వీరిలో 2,628 మంది కొవిడ్ పాజిటివ్ గా తేలింది. బుధవారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన కేసుల సంఖ్య కంటే గురువారం 24శాతం మేర అధికంగా కేసులొచ్చాయి. కరోనా వైరస్ తో చికిత్స పొందుతూ బుధవారం ఒక్కరోజు 2,167 మంది కోలుకున్నారు. కొత్త కేసుల పెరుగుదలతో క్రియాశీల కేసులు 15,414కు ఎగబాకాయి. ప్రస్తుతం క్రియాశీల రేటు 0.04 శాతానికి చేరగా.. రికవరీ రేటు 98.75శాతంగా ఉంది. గడిచిన 24గవంటల వ్యవధిలో కొవిడ్ బారిన పడి చికిత్స పొందుతూ 18 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో కొవిడ్ తో మరణించిన వారి సంఖ్య 5.24 లక్షలకు చేరింది.