Covid cases : కేరళ,కర్ణాటక రాష్ట్రాల్లో భారీగా పెరుగుతున్న కోవిడ్ కేసులు

దేశంలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.

Covid cases : కేరళ,కర్ణాటక రాష్ట్రాల్లో భారీగా పెరుగుతున్న కోవిడ్ కేసులు

Covid (2)

Covid cases  దేశంలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య కొద్ది రోజులగా గణనీయంగా పెరుగుతోంది. కర్ణాటకలో గురువారం 2,052 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే బుధవారం నమోదైన కేసుల కన్నా 500 కేసులు ఇవాళ అధికంగా నమోదయ్యాయి. ఇక, గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 35 కోవిడ్ మరణాలు నమోదయ్యాయని,1332 మంది కోవిడ్ నుంచి కోలుకోని డిశ్చార్జ్ అయ్యారని కర్ణాటక ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 23253 యాక్టివ్ కోవిడ్ కేసులున్నట్లు తెలిపింది.

దీంతో కర్ణాటకలో ఇప్పటివరకు మొత్తంగా నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 2901247కి చేరుకోగా,మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 36491కి చేరింది. ఇప్పటివరకు కోవిడ్ నుంచి కొలుకొని డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 2841479గా ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ గురువారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది.

మరోవైపు, కేరళలో ఇవాళ కొత్తగా 22,064 కోవిడ్ కేసులు,128 మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 16,649 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,54,820గా ఉందని కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మొత్తం నమోదైన కోవిడ్ మరణాల సంఖ్య 16,585కి చేరినట్లు తెలిపింది. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు సగం కేసులు కేరళ రాష్ట్రం నుంచి నమోదవుతున్నవే. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 31, ఆగస్టు 1 తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా పూర్తి లాక్ డౌన్ విధిస్తున్నట్టు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిని సమీక్షించేందుకు, కోవిడ్ మేనేజ్ మెంట్ లో ప్రభుత్వానికి సహకరించేందుకు ఆరుగురు సభ్యుల నిపుణుల బృందాన్ని కేరళకు పంపినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్ సుఖ్ మాండవీయ వెల్లడించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకన్నా శీఘ్రంగా కేరళలో వ్యాక్సినేషన్ జరుగుతున్నా దీని సీరో పాజిటివిటీ చాలా తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక, దేశవ్యాప్తంగా గురువారం 43,509 కోవిడ్ కేసులు,640 మరణాల నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 31,528,114కి చేరుకోగా,మొత్తం మరణాల సంఖ్య 4,22,662కి చేరింది. ఇప్పటివరకు 45 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను ప్రజలకు అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.