Covid In Kolhapur : కొల్హాపూర్ లో పెరుగుతున్న కరోనా..థర్డ్ వేవ్ కు సంకేతమా..?!

మహారాష్ట్రలో సెకండ్‌ వేవ్‌ తగ్గిందని అనుకుంటున్న సమయంలో మరోసారి కరోనా మహమ్మారి పడగ విప్పుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా గత 10 రోజుల్లోనే ఏకంగా 79,595 మంది కరోనా బారిన పడ్డగా..ఒక్క కొల్హాపూర్ లోనే 3,000 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కొల్హాపూర్ లో కరోనా ఆందోళన కలిగిస్తోంది.

Covid In Kolhapur : కొల్హాపూర్ లో పెరుగుతున్న కరోనా..థర్డ్ వేవ్ కు సంకేతమా..?!

Covid In Kolhapur Maharashtra (2)

Covid In Kolhapur Maharashtra : దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కేసులు తగ్గుతున్నాయి. కానీ మహారాష్ట్రలో సెకండ్‌ వేవ్‌ తగ్గిందని అనుకుంటున్న సమయంలో మరోసారి కరోనా మహమ్మారి పడగ విప్పుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా గత 10 రోజుల్లోనే ఏకంగా 79,595 మంది కరోనా బారిన పడ్డగా..ఒక్క కొల్హాపూర్ లోనే 3,000 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కొల్హాపూర్ లో కరోనా ఆందోళన కలిగిస్తోంది. కరోనా రెండో వేవ్‌ ప్రారంభమై దాదాపు 6 నెలలు కావొస్తున్న క్రమంలో మరోసారి కేసులు పెరుగుతుండటంతో ఆందోళన పెరుగుతోంది. దీంతో పెరుగుతున్న కరోనా బాధితుల సంఖ్య ప్రభుత్వాన్ని అందోళనకు గురిచేస్తోంది. అంతేకాదు దేశంలో కరోనా మరణాలు కూడా పెరుగుతుండటంతో సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా తగ్గలేదని తెలుస్తోంది. దీనికి నిదర్శనంగా..కొత్తగా 2020మంది బలికావటమే. కొన్ని రోజులుగా 1000లోపే మరణాలు ఉండేవి. కానీ కొన్ని రోజుల నుంచి కరోనా మరణాలు పెరుగుతున్నాయి.

మహారాష్ట్రలో వ్యాక్సినేషన్‌ డ్రైవ్స్ కొనసాగుతోంది. అయినా సరే రాష్ట్రంలోని కొల్హాపూర్‌ జిల్లాలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నాయి. కొల్హాపూర్‌లో అత్యధిక వాక్సినేషన్‌ జరిగినప్పటికీ కేసులు ఎందుకు తగ్గడం లేదో అర్థం కావడం లేదని సీనియర్ డాక్టర్లు సైతం అందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలోని మరో 8 జిల్లాల్లో కరోనా కేసులు అధికంగా నమోదవుతుండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి ప్రమాదకర పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోకపోతే సెకండ్ వేవ్ లో కేసులు తగ్గకపోగా..దీనికి తోడు థర్డ్ వేవ్‌ కూడా జత కలిస్తే పరిస్థితి ఏమవుతుందోననే ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

గడిచిన 11 రోజుల్లో మహారాష్ట్రలో 83,130 పాజిటివ్ కేసులు నమోదు కావటంతో ఈ కేసుల నమోదు చూస్తుంటే థర్డ్ వేవ్ కు సంకేతమేమో ననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మహారాష్ట్రలోనే కాకుండా కేరళలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలోని మొత్తం కేసుల్లో మహారాష్ట్ర, కేరళ రాష్ట్రల్లోని కేసులు దాదాపు 53 శాతం ఉన్నాయి. కరోనా రెండో వేవ్‌లో ఢిల్లీలో ఒకప్పుడు 25 వేల కేసుల వరకు పెరిగిపోయాయి. సోమవారం (జులై 11;2021) ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 4,32,778 యాక్టివ్ కేసులు నమోదు కాగా..40,68,862 టీకాలు వేశారు. అలాగే మరణాల సంఖ్య 2020గా నమోదు అయ్యింది.

మహారాష్ట్రలో కరోనా నియంత్రణలోకి రాకపోవడం వెనక ఉన్న కారణాలను ప్రభుత్వం కనుగొంటోంది. కానీ, ఇంత వరకు ఒక నిర్ధారణకు రాలేకపోతున్నారు. మహారాష్ట్ర తర్వాత కేరళలో కూడా అత్యధిక కేసులు బయటపడుతున్నాయి. కరోనా కేసులు పెరుగుదల చూస్తోంటే త్వరలోనే మహారాష్ట్ర మూడో వేవ్‌కి గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.