Covid In India : కోవిడ్ విజృంభణ..రాష్ట్రాలకు కేంద్రం మరో లేఖ

దేశంలో కోవిడ్ కేసులు కొద్ది రోజులుగా భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. దేశంలో థర్డ్ వేవ్ మొదలైందని అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓ పక్క వైరస్‌ అడ్డుకట్టకు

Covid In India : కోవిడ్ విజృంభణ..రాష్ట్రాలకు కేంద్రం మరో లేఖ

Covid (4)

Covid In India : దేశంలో కోవిడ్ కేసులు కొద్ది రోజులుగా భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. దేశంలో థర్డ్ వేవ్ మొదలైందని అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓ పక్క వైరస్‌ అడ్డుకట్టకు టీకా కీలకమని రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సంబంధిత అధికారులు వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కష్టపడుతున్నారు. మరోవైపు,కోవిడ్‌ చాప కింద నీరులా పాకుతూ దేశవ్యాప్తంగా తన ఉనికిని మళ్లీ చాటేందుకు చూస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

దీంతో మరోసారి కేంద్రం కేంద్రపాలిత ప్రాంతాలకు రాష్ట్రాలకు లేఖ రాసింది. కోవిడ్‌ నివారణ చర్యలను ముందస్తుగా ఏర్పాటు చేసుకోవాలని ఆ లేఖలో కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశించింది. జిల్లా, సబ్‌ స్థాయిలో కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేయాలిని సూచించింది. అయితే ఈ కంట్రోల్ రూమ్స్‌లలో వైద్య సిబ్బంది, వలంటీర్స్, కౌన్సిలర్స్, జనాభాకు అనుగుణంగా తగినన్ని టెలిఫోన్లను అందుబాటులో ఉంచాలంటూ కేంద్రం లేఖలో స్పష్టంచేసింది. అంతేకాకుండా బ్రాడ్‌బాండ్‌తో కూడిన కంప్యూటర్లను అందుబాటులో ఉంచాలని వెల్లడించింది.

జిల్లాలో కరోనా కేసుల సంఖ్య నమోదుకు అనుగుణంగా కంట్రోల్ రూమ్స్ 24 గంటలు పనిచేయాలని, వైరస్ బాధితులకు ఎప్పటికప్పుడు సహాయం అందించాలని పేర్కొంది. జిల్లా పరిధిలోని ఆసుపత్రుల్లో ఎక్కడెక్కడ బెడ్స్ అందుబాటులో ఉన్నాయో కంట్రోల్ రూమ్స్ ద్వారా మానిటరింగ్ చేస్తూ ఫోన్ కాల్స్‌లో సమాధానం చెబుతుండాలని సూచించింది. కరోనా కేసులు ఎక్కువగా పెరుగుదల ఉన్న ప్రాంతాల్లో వైరస్ బాధితులను తరలించేందుకు వీలుగా కంట్రోల్ రూమ్స్ వద్ద అందుబాటులో అవసరమైనన్ని అంబులెన్సులను ఉంచాలని సూచించింది. ఆస్పత్రుల్లో సిబ్బంది, మౌలికవసతులు, పడకల లభ్యత చూసుకోవడంతో పాటు హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి తగిన వైద్య సూచనలు చేయాలిని ఆదేశించింది.

ALSO READ Anurag Thakur : ప్రధాని పర్యటనలో భద్రతా లోపం..కఠిన నిర్ణయాలకి సిద్ధమైన హోంశాఖ!