Covid Deaths : స్మశానాల దగ్గర ట్రాఫిక్ జామ్.. మృతదేహాలతో బారులు తీరిన వాహనాలు.. బెంగళూరులో భయానకం

కర్నాటక రాజధాని బెంగళూరులో కరోనా కోరలు చాచింది. కరోనా సోకి చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. స్మశానాల దగ్గర ట్రాఫిక్ జామ్ అయ్యింది. స్మశానాల దగ్గర మృతదేహాలను తీసుకొచ్చిన వాహనాలు బారులు తీరుతున్నాయి. బెంగళూరులోని స్మశాలన్నీ ఫుల్ అయ్యాయి.

Covid Deaths : స్మశానాల దగ్గర ట్రాఫిక్ జామ్.. మృతదేహాలతో బారులు తీరిన వాహనాలు.. బెంగళూరులో భయానకం

Covid Deaths

Covid Deaths : కర్నాకట రాజధాని బెంగళూరులో కరోనా కోరలు చాచింది. కరోనా సోకి చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. స్మశానాల దగ్గర ట్రాఫిక్ జామ్ అయ్యింది. స్మశానాల దగ్గర మృతదేహాలను తీసుకొచ్చిన వాహనాలు బారులు తీరుతున్నాయి. బెంగళూరులోని స్మశాలన్నీ ఫుల్ అయ్యాయి.

బెంగళూరులో కోవిడ్‌ సోకి నిత్యం 50 మంది వరకూ మరణిస్తున్నారు. నగరంలోని 5 శ్మశానాల్లో కోవిడ్‌ మృతులకు అంత్యక్రియలు చేస్తున్నారు. ప్రతి రోజూ కనీసం 20 మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్నారు. శ్మశాన వాటిక దగ్గర ఒక్కో అంబులెన్సు అంత్యక్రియల కోసం నాలుగైదు గంటలు క్యూలో వేచి చూడాల్సి పరిస్థితి ఏర్పడింది. తమ వారి అంత్యక్రియలు పూర్తి చేసుకుని తిరిగి వెళ్లేందుకు బంధువులు ఒక రోజంతా స్మశానం దగ్గరే వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది.

ఐదే ఐదు శ్మశాన వాటికలు:
బెంగళూరు జాలహళ్లి దగ్గర ఉన్న సుమనహళ్లి, కెంగేరి, బొమ్మనహళ్లి, పెనత్తూరు శ్మశానవాటికల్లో(ఎలక్ట్రిక్) కోవిడ్‌ సోకి మరణించిన మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్నారు. ఒక్కో స్మశాన వాటికలో రెండు మెషిన్లు మాత్రమే ఉన్నాయి. కోవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలతో ఈ ప్రాంతాల్లో అంత్యక్రియలు చేపడుతున్నారు. ఇదే సమయంలో అంత్యక్రియలు చేసే సిబ్బందికి అత్యంత అవసరమైన పీపీఈ కిట్లు లభించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వృద్ధులే అధికం..
ఈ ఏడాది(2021) ఏప్రిల్‌లో 280 మంది బెంగళూరు వాసులు కోవిడ్‌తో మృత్యువాత పడ్డారు. ఏప్రిల్‌ 13, 14 తేదీల్లో కరోనా సోకి 55 మంది చనిపోయారు. ఈ ఏడాది జనవరిలో 66మంది, ఫిబ్రవరిలో 88, మార్చిలో 147, ఏప్రిల్‌లో 280 మంది మరణించారు. ఇందులో 210 మందికి పైగా 60 ఏళ్లు పైబడిన వృద్ధులే ఉన్నారు. సాధారణంగా విద్యుత్ తో పని చేసే దహన వాటికల్లో ఓ డెడ్ బాడీని దహనం చేయాలంటే 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతుంది. అదే కరోనాతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని దహనం చేయాలంటే కనీసం అరగంట సమయం పడుతుంది. ఈ రద్దీపై అధికారులు స్పందించారు. కొంతమంది ఆన్ లైన్ లో స్లాట్ బుక్ చేసుకోకుండానే స్మశాన వాటికకు వస్తున్నారని, దాంతో స్లాట్స్ అన్నీ అయిపోయే వరకు వారు వేచి చూడాల్సి వస్తోందని వివరించారు.

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విశ్వరూపం చూపిస్తోంది. గత సంవత్సర కాలంలో ఎన్నడూ లేని ఉద్ధృతితో ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. మనదేశంలో కరోనా కేసుల వేగం అమెరికా కంటే అధికంగా ఉంది. అగ్రరాజ్యంలో లక్ష నుంచి 2లక్షల కేసులు పెరగడానికి 34 రోజుల సమయం పడితే భారత్‌లో పది రోజులే పట్టింది.

తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. 14,73,210 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2లక్షల 17వేల 353 కొత్త కేసులు బయటపడ్డాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,42,91,917 చేరింది. నిన్న(ఏప్రిల్ 15,2021) 1,185 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 1,74,308 మంది కరోనాతో చనిపోయారు.

ఇక, యాక్టివ్ కేసులు 15లక్షలకు పైబడి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ రేటు 10.46శాతానికి పెరిగింది. ఇక నిన్న లక్షమందికి పైగా కోలుకోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. గడిచిన 24 గంటల్లో 1,18,302 మంది కోలుకోగా.. మొత్తంగా కోటీ 25లక్షల మంది వైరస్‌ను జయించారు. ప్రస్తుతం రికవరీ రేటు 88.31 శాతానికి పడిపోయింది. ఇంతకాలం మహారాష్ట్ర మీద పడగవిప్పిన కరోనా వైరస్ ఇప్పుడు ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్‌కు విస్తరిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక, కేరళలో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.