కరోనాతో చనిపోయిన వారిలో వైరస్ ఉంటుందా..తెలుసుకోవాల్సిన విషయాలు

  • Published By: madhu ,Published On : August 15, 2020 / 06:52 AM IST
కరోనాతో చనిపోయిన వారిలో వైరస్ ఉంటుందా..తెలుసుకోవాల్సిన విషయాలు

కరోనాతో చనిపోయిన వారిలో వైరస్ ఉంటుందా ? చాలా మందికి దీనిపై సందేహాలున్నాయి. చనిపోయిన వారి పట్ల కనీసం జాలి, దయ చూపడం లేదు. సొంత కుటుంబసభ్యులే డెడ్ బాడీని తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు.



ఎన్నో కంటతడిపించే ఘటనలు వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. గత్యంతరం లేక మున్సిపల్‌ సిబ్బందే ఆ మృతదేహాలకు అంత్యక్రియలు చేయడం వంటి సంఘటనలను చూస్తున్నాం.

కరోనాతో చనిపోయిన వారి శరీరంలో వైరస్ ఉంటుందనే భయం వారిలో నెలకొంటోంది. కానీ అలాంటిది ఏమీ ఉండదని అంటున్నారు వైద్య నిపుణులు. అయతే..డెడ్ బాడీ కొన్ని రకాల ద్రవాలు, ముక్కు, నోరు ఇతర రంధ్రాల నుంచ బయటకు రావడానికి వీలుంటుందని, కానీ..కొన్ని జాగ్రత్తలు తీసుకుని డెడ్ బాడీని బంధువులకు అప్పగించవచ్చని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.



చనిపోయిన వారి దగ్గరకు కనీసం కుటుంబసభ్యును రానివ్వడం లేదు. చివరి చూపు కూడా నోచుకోక ఎంతో మంది కుటుంబసభ్యుల ఆవేదన వర్ణనాతీతం. మున్సిపల్ సిబ్బందే..చివరి కార్యక్రమాలు చేసేస్తున్నారు. అందరూ ఉన్నా అనాథలుగా శవాల్లా అంత్యక్రియలు చేస్తున్నారు. మృతదేహం దగ్గదు, తుమ్మదు కాబట్టి దాని నుంచి వైరస్ రాదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

అంత్యక్రియలకు ఎక్కువ మంది రావడం వల్ల భౌతిక దూరం లేకపోవడం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల.. వైరస్‌ వచ్చిన వాళ్ల నుంచి ఇతరులకు సోకే అవకాశం ఉంది. అందుకే అత్యంత తక్కువ మందితోనే అంత్యక్రియలు చేయాలని సర్కారు గతంలోనే స్పష్టం చేసింది.



కరోనా మృతదేహాలకు శవపరీక్షలు చేయకూడదు. ప్రత్యేక పరిస్థితుల్లో చేయాల్సి వస్తే వారు పీపీఈ కిట్లు ధరించాలి. ప్రక్రియ ముగిశాక ప్రత్యేక బ్యాగ్‌లో మృతదేహాన్ని ఉంచాలి. దాని పైభాగాన సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణంతో శుభ్రపరిచి మృతదేహాన్ని బంధువులకు అప్పగించవచ్చు.
మృతదేహానికి స్నానం చేయించడం, మీదపడి ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం వంటి వాటిని అనుమతించకూడదు.
కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలి. వారి మనోభావాలను గౌరవించాలి.
బంధువులు చివరిసారిగా మృతదేహాన్ని చూడటానికి, తమ మతపరమైన ఆచారాలను పాటించడం, పవిత్ర జలం చల్లుకోవడం వంటి వాటిని అనుమతించవచ్చు. శరీరాన్ని తాకకుండా ఏవైనా మతపరమైన ఆచారాలను అనుమతించవచ్చు.



కరోనా మృతదేహాలతో ఎటువంటి అదనపు ప్రమాదం ఉండదని శ్మశానవాటిక సిబ్బంది గ్రహించాలి.
అంత్యక్రియలు పూర్తయ్యాక కుటుంబ సభ్యులు చేతులను శుభ్రపరుచుకోవాలి.
దహన ప్రక్రియ అనంతరం బూడిద ఎటువంటి ప్రమాదం కలిగించదు. దీన్ని చివరి కర్మలు చేయడానికి సేకరించవచ్చు.