Covid Patients Attendants: సూపర్ స్పెడర్లుగా మారుతున్న కొవిడ్ పేషెంట్స్ అటెండెంట్లు

కొవిడ్ పేషెంట్ల అటెండెంట్లను హాస్పిటల్ లోనికి అనుమతించొద్దని తమిళనాడు ఆరోగ్య శాఖ ఆదేశాలిచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కొవిడ్ పేషెంట్ల

Covid Patients Attendants: సూపర్ స్పెడర్లుగా మారుతున్న కొవిడ్ పేషెంట్స్ అటెండెంట్లు

Covid Patients Attendants Risk Becoming Super Spreaders In Tamil Nadu

Covid Patients Attendants: కొవిడ్ పేషెంట్ల అటెండెంట్లను హాస్పిటల్ లోనికి అనుమతించొద్దని తమిళనాడు ఆరోగ్య శాఖ ఆదేశాలిచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కొవిడ్ పేషెంట్ల దగ్గరకు సేఫ్టీ ప్రొటోకాల్స్ మరిచిపోయి సునాయాసంగా వెళ్లి వస్తుండటంతో వైరస్ వ్యాప్తి పెరుగుతూ వస్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో డాక్టర్లు, నర్సులు కొరత ఉండటంతో నియంత్రణ కరువై అటెండంట్లు సూపర్ స్ప్రెడర్లుగా మారుతున్నారని అన్నారు.

రాజీవ్ గాంధీ హాస్పిటల్ లోని కొవిడ్ బ్లాక్ ను ఓ ఇంగ్లీష్ మీడియా స్టడీ చేసింది. గ్రౌండ్ ఫ్లోర్ లోని హాల్స్ లో ఆక్సిజన్ బెడ్లపై పేషెంట్లు ఉన్నారు. ప్రతి బెడ్ కు ఒక అటెండెంట్, అది కూడా కుటుంబ సభ్యుల్లో ఒకరే అవడంతో వారితో మాట్లాడుతూ ఉంటున్నారు.

కొందరైతే పేషెంట్లతో కలిసి కూర్చుంటున్నారు కూడా. వాళ్లెవరూ పీపీఈ కిట్లు ధరించకుండానే సోషల్ డిస్టన్సింగ్ పాటించకుండానే ఉంటున్నారు. ఇరువైపులా ఉన్న హాల్స్ లో గుంపులుగా జనం నిండిపోవడం కొద్ది మంది డాక్టర్లు, నర్సులు మాత్రమే కొద్ది కేసులకు మాత్రమే అటెండ్ అవుతున్నారు.

కారిడార్లలో కూడా పేషెంట్లు, విజిటర్లతో నిండిపోతుండగా మరి కొందరు రెస్టింగ్ తీసుకుంటూ అస్సలు కొవిడ్ సేఫ్టీ సూచనలు పాటించకుండా చాటింగ్ చేసుకుంటూ కనిపించారు. బోర్డు మీద మాత్రం విజిటర్లకు అనుమతి లేదు, అని ఉంది కానీ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఉండటంతో అంతా ఫ్రీగానే వెళ్లి వస్తున్నారు.

ఇక ఆక్సిజన్ లేకపోగా తమకు కొద్దిపాటి మెడికల్ సాయం మాత్రమే అందుతుందని అటెండంట్లు అంటున్నారు. కొవిడ్ రోగులకు సేవలందిస్తోన్న ఓ సిస్టర్ మాట్లాడుతూ.. డాక్టర్లు, నర్సుల కొరత ఉండటంతో ఏం చేయలేకపోతున్నాం. సరిపడ డాక్టర్లు లేరు, నర్సులు సరిపోవడం లేదు. పేషెంట్లు వస్తూనే ఉన్నారు. మేం మాత్రం ఏం చేయగలం అని అంటున్నారు.