ఆక్సిజన్ కొరతతో నలుగురు కరోనా పేషెంట్లు మృతి

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఆక్సిజన్  కొరతతో నలుగురు కరోనా పేషెంట్లు మృతి

Covid Patitents Died In Up Due To Lack Of Oxygen Supply

covid patitents దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కొత్త కేసులు భారీగా పెరగడంతో అన్ని చోట్లా హాస్పిటల్స్ లో బెడ్స్ ఫుల్ అయిపోతున్నాయి. చాలా చోట్ల హాస్పిటల్స్ లో బెడ్స్ దొరకక..ఒక బెడ్ పై ఇద్దరు పేషెంట్లకు ట్రీట్మెంట్ అందిస్తున్న విషయం తెలిసిందే.

కాగా, మిగతారాష్ట్రాల మాదిరిగానే దేశంలోనే జనాభాపరంగా అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి.ఉత్తర్​ప్రదేశ్​లో వైరస్​ కేసులు పెరుగుతున్నందున.. లక్నోలోని గోమ్​తీ నగర్​లోని డాక్టర్​ రామ్​ మనోహర్​ లోహియా ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్ హాస్పిటల్ లో చేరే వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. అక్కడ పడకలన్నీ కరోనా రోగులతో నిండిపోగా.. మిగతావారికి స్ట్రెచర్​పైనే ఆక్సిజన్​ అమర్చారు డాక్టర్లు. అయితే.. శనివారం ఉదయం 6 గంటలకు హాస్పిటల్ బ్లాక్​లో ఆక్సిజన్​ పూర్తిగా అయిపోవడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న ముగ్గురు కొవిడ్​ పేషెంట్లు మరణించారు. లోహియా హాస్పిటల్ లో గతంలో రోజుకు 40-45 ఆక్సిజన్ సిలిండర్లు ఉపయోగించేవారు. కొవిడ్​ కేసులు పెరుగుతున్నందున.. ప్రస్తుతం రోజుకు సగటున 150 ఆక్సిజన్​ సిలిండర్లు అవసరమవుతున్నాయి. పలు కారణాల వల్ల శుక్రవారం సిలిండర్ల సరఫరా సక్రమంగా లేనందున ఈ పరిస్థితి తలెత్తింది.

ఇక, రాజస్తా​లో కూడా ఇదే తరహాలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిరోహికి చెందిన ఓ మహిళ ఇటీవల కరోనా బారినపడి పాళీలోని బంగర్​ హాస్పిటల్ లో చేరారు. గురువారం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి.. ఆక్సిజన్ అవసరమైంది. అక్కడి డాక్టర్లు ఆక్సిజన్​ సరఫరా ఇవ్వకపోవడం వల్ల.. ఆమె స్ట్రెచర్​పైనే మరణించారు. ఆక్సిజన్​ కొరత కారణంగా.. మరో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.