Covid : జాగ్రత్త.. సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదు, ఇళ్లలోనే జరుపుకోండి

భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదా? ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందేనా? అంటే, అవుననే అంటోంది కేంద్రం. మే 10 నుంచి చూస్తే కరోనా మహమ్మారి వీక్లీ పాజిటివిటీ రేటు ట్రెండ్

Covid : జాగ్రత్త.. సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదు, ఇళ్లలోనే జరుపుకోండి

Covid

Covid : భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదా? ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందేనా? అంటే, అవుననే అంటోంది కేంద్రం. మే 10 నుంచి చూస్తే కరోనా మహమ్మారి వీక్లీ పాజిటివిటీ రేటు ట్రెండ్‌ మన దేశంలో బాగా తగ్గింది. అయినప్పటికి కరోనా సెకండ్‌ వేవ్‌ ఇంకా ముగియలేదని కేంద్రం తేల్చి చెప్పింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.

దేశంలో కరోనా వైరస్‌ పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు మాట్లాడారు. ఆగస్టు 31 నాటికి దేశంలో 39 జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు 10శాతం కన్నా అధికంగా ఉందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. మరో 38 జిల్లాల్లో మాత్రం ఈ రేటు 5 నుంచి 10 శాతంగా ఉన్నట్టు చెప్పారు. థర్డ్‌ వేవ్‌ ముప్పు పొంచి ఉందన్న ఆందోళనల నేపథ్యంలో రాబోయే పండుగల సీజన్‌లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. జనం భారీగా గుమిగూడొద్దని, ఒకవేళ తప్పనిసరైతే పూర్తిగా వ్యాక్సినేషన్‌ అయ్యేలా చూసుకోవాలని కోరారు. ప్రజలంతా ఇళ్లలోనే పండుగలు జరుపుకోవాలని, వ్యాక్సిన్‌ తీసుకోవడంతో పాటు కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

No Smoking : వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉన్నా స్మోకింగ్ చేయకూడదు.. ఉద్యోగులకు కొత్త రూల్

దేశంలో ప్రస్తుతం ఉన్న మూడున్నర లక్షలకు పైగా ఉన్న యాక్టివ్ కేసుల్లో 2,30,461 (59.16శాతం) కేసులు ఒక్క కేరళలోనే ఉన్నాయన్నారు. 54,606 కేసులు (14.02 శాతం) మహారాష్ట్రలో, 18,438 కేసులు (4.73శాతం) కర్ణాటక, 16,620 కేసులు (4.27శాతం) తమిళనాడు, 14,473 కేసులు (3.71శాతం) ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నట్టు వివరించారు. యాక్టివ్‌ కేసులు లక్ష కన్నా అధికంగా ఒక రాష్ట్రంలో ఉండగా.. 10 వేలు నుంచి లక్ష వరకు నాలుగు రాష్ట్రాల్లో, 10వేల కన్నా తక్కువ కేసులు 31 రాష్ట్రాల్లో ఉన్నట్టు తెలిపారు.

దేశంలో సెకండ్‌ వేవ్‌ తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో త్వరలో రాబోయే వినాయక చవితి, దీపావళి, ఈద్‌ వంటి పండుగలను ఇంట్లోనే జరుపుకోవాలని, బయట గుంపులు గుంపులుగా గూమిగూడద్దని అధికారులు కోరారు. ”గతేడాది కొవిడ్‌ మార్గదర్శకాలు పాటిస్తూ.. పండుగలను ఎలాగైతే జరుపుకొన్నామో.. ఈ ఏడాది కూడా అదే పద్ధతిని కఠినంగా అమలు చేయాలి. జన సంచార ప్రదేశాల్లో మాస్క్‌ ధరించడం తప్పనిసరి’’ అని నీతి ఆయోగ్‌ సభ్యుడు (ఆరోగ్యం) వీకే పాల్‌ అన్నారు.

Typhus Vaccine : పేన్లతో ఏ వ్యాధికి వ్యాక్సిన్ తయారు చేసారో తెలుసా??

ప్రస్తుతం భారత్‌లో సెకెండ్‌ వేవ్‌ కొనసాగుతోందని, అందుకే ప్రజలు తమ ప్రాంతాల్లో కొవిడ్‌ నిబంధనల్ని తప్పకుండా అమలు చేయాలని ఐసీఎంఆర్‌ డీజీ డాక్టర్‌ బలరామ్‌ భార్గవ సూచించారు. పండుగ సీజన్‌ సమీపించడంతో పాటు స్కూళ్లు పునఃప్రారంభం కావడం, కేరళలో పెరుగుతున్న కేసులు.. ఇలా మొత్తంగా కలుపుకుని గత రెండు నెలలుగా నమోదు కానంత స్థాయిలో గురువారం ఒక్కరోజే 47వేలకు పైగా కొత్త కేసులు నమోదవడం గమనార్హం. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 300 డెల్టా ప్లస్ వేరియంట్‌ కేసులు నమోదైనట్టు కేంద్రం వెల్లడించింది.

దేశంలోని మొత్తం వయోజన జనాభాలో 16% పూర్తిగా టీకాలు వేయబడ్డారు. మొత్తం వయోజన జనాభాలో 54% మంది ఒక్క డోస్ అందుకున్నారని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. 2021 ఆగస్టు నెలలో మాత్రమే 18.38 కోట్ల డోసులు ఇచ్చాం. ఆగస్టులో రోజుకు సగ‌టున‌ 59.29 లక్షల డోసులు ఇచ్చాం. నెల చివరి వారంలో మేము రోజుకు 80 లక్షలకు పైగా డోసులు ఇచ్చామ‌ని భూషణ్ చెప్పారు. చాలామంది గర్భిణీలు టీకా తీసుకునేందుకు ముందుకు రావాలి. ఇది వారికి, వారికి పుట్టబోయే పిల్లలకు ముఖ్యం అన్నారు.

ఇటీవల దక్షిణాఫ్రికా సైంటిస్టులు కొత్త రకం కరోనా వేరియంట్​ను గుర్తించారు. సీ.1.2గా పిలిచే ఈ రకం సింగిల్​ వైరస్​ కాదు.. జన్యుక్రమాలు సారూప్యంగా ఉన్న వైరస్​ల సమూహం. ఈ వేరియంట్​పై ఇంకా పూర్తి స్థాయిలో అధ్యయనం జరగలేదు కానీ.. వ్యాప్తి ప్రమాదకరంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి మ్యుటేషన్​ రేటూ ఎక్కువే అని వెల్లడించారు. అంటే.. తక్కువ కాలవ్యవధిలో ఎక్కువ మ్యుటేషన్లు బయటపడుతున్నాయని అర్థమవుతుంది. నిజానికి.. వైరస్​ల స్వభావం అదే. నిరంతరం పరిణామం చెందుతూనే ఉంటాయి. మార్పులు సంభవిస్తూనే ఉంటాయి. అయితే.. సీ.1.2 ను ఇతర వేరియంట్లతో పోల్చి చూడటం తొందరపాటే అవుతుందని పరిశోధకులు అంటున్నారు.