Delhi covid cases : ఢిల్లీలో కోరలు చాస్తున్న కరోనా.. లోకల్ సర్కిల్స్ సర్వేలో ఆందోళన కలిగించే విషయాలు ..

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కోరలు చాస్తుంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. ఒమిక్రాన్ రూపంలో కొత్త వేరియంట్‌లు పుట్టుకొస్తున్న...

Delhi covid cases : ఢిల్లీలో కోరలు చాస్తున్న కరోనా.. లోకల్ సర్కిల్స్ సర్వేలో ఆందోళన కలిగించే విషయాలు ..

Delhi Covid Cases

Delhi covid cases : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కోరలు చాస్తుంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. ఒమిక్రాన్ రూపంలో కొత్త వేరియంట్‌లు పుట్టుకొస్తున్నవేళ కొవిడ్ వ్యాప్తి పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మరోవైపు చిన్నారుల్లో కొవిడ్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుండటంతో పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం సూచించింది. కొవిడ్ వ్యాప్తి జరిగిన పాఠశాలలు మూసివేయాలని ఆదేశించింది. ఇదిలాఉంటే ఆదివారం ఢిల్లీలో 517 కేసులు నమోదయ్యాయి. ఇది శనివారంతో పోల్చితే 12శాతం ఎక్కువ. శనివారం 461 పాజిటివ్ కేసులు నమోదుకాగా, ఆదివారం వాటి సంఖ్య పెరిగింది. ఈ ఏడాదిలో ఫిబ్రవరి 20 తరువాత ఇదే అత్యధికం.

Corona Virus: ఢిల్లీలో కరోనా డేంజర్ బెల్స్.. 5.33శాతంకు పెరిగిన పాజిటివిటీ రేటు.. 20న డీడీఎంఎ సమావేశం

దేశంలో కొవిడ్ వ్యాప్తి తగ్గుతూవస్తుంది. రోజుకు వెయ్యిలోపు కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలోనే ఏకంగా ఐదు వందలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండటం అందరిలోనూ భయాందోళనకు గురిచేస్తోంది. ఇఫ్పటికే చైనాలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్లు విజృంభిస్తున్నాయి. ఈ క్రమంలో చైనా ప్రభుత్వం దేశవ్యాప్తంగా వంద ప్రధాన నగరాల్లో 80కిపైగా నగరాల్లో లాక్ డౌన్ విధించింది. లాక్ డౌన్ కారణంగా అక్కడి ప్రజలు నిత్యావసర వస్తువులు దొరక్క, తినేందుకు తిండిలేక అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలోనూ అదే పరిస్థితి పునరావృతం అవుతుందాఅన్న ఆందోళన స్థానిక ప్రజల్లో వ్యక్తమవుతుంది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో గడిచిన 15 రోజుల్లోనే కొవిడ్ వ్యాప్తి 500శాతం పెరిగినట్లు తాజా సర్వేలో వెల్లడైంది. ఢిల్లీలో కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా వైరస్ ప్రాబల్యాన్ని అంచనా వేసేందుకు లోకల్ సర్కిల్ ఓ సర్వే నిర్వహించింది.

Corona 4th wave: కొత్తగా కోవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయిన చిన్నారుల్లో సహసంబంధ వ్యాధులు

గడిచిన రెండు వారాల్లో మీ సన్నిహితుల్లో ఎంత మంది వైరస్ బారిన పడ్డారని ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని 11,743 మంది నివాసితులను ప్రశ్నించగా.. ఏ ఒక్కరికీ కరోనా సోకలేదని 70శాతం మంది, తమ సన్నిహితుల్లో ఒకరు లేదా ఇద్దరు వైరస్ బారినపడ్డారని 11శాతం మంది చెప్పినట్లు సర్వే సంస్థ పేర్కొంది. 8శాతం మంది ముగ్గురు నుంచి ఐదుగురికి వైరస్ సోకిందని చెప్పగా, మరో 11శాతం మంది చెప్పలేం అనే సమాదానం ఇచ్చినట్లు, కేవలం మూడుశాతం మంది మాత్రమే తమ సన్నిహితుల్లో ఎవరో ఒకరు కొవిడ్ బారినపడ్డారని సర్వే సంస్థ వెల్లడించింది. అయితే గత పదిహేను రోజులుగా కొవిడ్ తీవ్రత భారీగా పెరుగుతూ వస్తుంది. ఆదివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం కొత్తగా 517 కేసులు నమోదయ్యాయి. పాజిటివీటి రేటు 4.21 గా నమోదైంది. కొవిడ్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి కేంద్రీకరించినప్పటికీ.. పెరుగుతున్న కొవిడ్ కేసులతో దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది.